Chicken Biryani: ఓ చికెన్‌ బిర్యానీ ..రూ. 8 లక్షల బిల్లు..21 రోజుల పాటు!

ముంబై కుర్లా ప్రాంతానికి చెందిన రూబీ అనే మహిళకు రెస్టారెంట్‌ లో బిర్యానీ తింటున్న సమయంలో ఎముక గొంతులో ఇరుక్కుంది. దాని వల్ల ఆమె 21 రోజుల పాటు అవస్థలు పడగా...8 లక్షలు ఖర్చు పెట్టి బయటకు తీయాల్సి వచ్చింది.

New Update
biryani

biryani

ఓ చికెన్‌ బిర్యానీ ఖరీదు మా ఉంటే ఎంత ఉంటుంది..ఓ 400 లో..ఓ 500 ఉంటుంది.కానీ ఇక్కడ ఓ చికెన్ బిర్యానీ తిన్నాక అయిన ఖర్చు మాత్రం ఏకంగా అక్షరాల 8 లక్షల రూపాయలు. అదేంటి అంత స్పెషల్‌ చికెన్‌ బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా..అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే మరి.

Also Read:  UP: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!

మహారాష్ట్ర (Maharashtra) లోని ముంబై కుర్లా ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం రెస్టారెంట్‌ కి వెళ్లి ఎంజాయ్‌ చేసినంత సేపు లేదు వారి అదృష్టం.  ఆ ఆనందాల విందు కాస్తా దురదృష్టకర సంఘటనగా మారడంతోపాటు ప్రస్తుతం చర్చనీయాంశంగా నిలిచింది. 34 ఏళ్ల షేక్ రూబీ అనే మహిళ ఫిబ్రవరి 3న తన కుటుంబసభ్యులతో స్థానిక రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడ చికెన్ బిర్యానీ (Chicken Biryani) ఆర్డర్ చేసింది.. అయితే. ఆ బిర్యానీ.. తనను ఆసుపత్రికి చేర్చి ముప్పు తిప్పలు పెడుతుందని అస్సలు అనుకోలేదు. బిర్యానీ తిన్న వెంటనే ఆమెకు భయానక అనుభవం ఎదురైంది. బిర్యానీలోని చికెన్‌ ఎముక గొంతులో ఇరుక్కోవడంతో నెల రోజుల పాటు  అవస్థలు పడింది.

Also Read: Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు!

Mumbai Chicken Biryani @8 Lakhs

అయితే.. ఆ చిన్న ఎముకను డాక్టర్లు 8 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. దాదాపు 8 లక్షల రూపాయల ఖర్చు అయింది. కోలుకునేందుకు 21 రోజులు పట్టింది.ఆ 21 రోజులు కూడా  నరకం చూసినట్లు మహిళ ఆవేదన వ్యక్తంచేసింది.

రూబీ అన్నవాహికను దెబ్బతీసిన 3.2 సెం.మీ. కోడి ఎముకను ఫిబ్రవరి 8న తొలగించారు. కానీ క్రిటికేర్ ఆసియా హాస్పిటల్‌లోని వైద్యులు గొంతు ప్రక్రియను ప్రారంభించినప్పుడు, అది దాని ప్రారంభ స్థానం (C4-C5 వెన్నుపూస డిస్క్‌లు) నుంచి కనిపించకుండా పోయింది. ఎక్స్-రే – అల్ట్రాసౌండ్ పరీక్షలలో ఛాతీ లేదా ఉదరంలో అది లేదు. రోగికి ఇంట్యూబేట్ చేసినప్పుడు చేసిన CT స్కాన్, గొంతు పైభాగమైన నాసోఫారెంక్స్‌కు ఊహించని విధంగా పైకి కదులుతున్నట్లు తెలిసింది. 

ఆపరేషన్ రెండు గంటలకు బదులుగా ఎనిమిది గంటలు కొనసాగిందని వైద్యులు తెలిపారు. ముందు ప్రారంభ స్థానంలో ఉన్న ఎముక.. రోగి దగ్గడంతో పైకి ప్రయాణించిందని వైద్యులు చెప్పారు అయితే.. ఆపరేషన్ కు మొత్తం 8 లక్షల బిల్లు అయిందని రూబీ భర్త వివరించాడు.. స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లు అందించిన విరాళాలతో ఈ మొత్తం పోగేసి ఆపరేషన్ చేయించినట్లు తెలిపాడు..

కాగా, ఈ ఆపరేషన్ తర్వాత 21 రోజుల పాటు గొంతులో అమర్చిన ప్రత్యేకమైన పైప్ ద్వారానే రూబీ ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. నెల రోజుల తర్వాతే కోలుకున్నానని.. ఇన్ని అవస్థలపాలు చేసిన బిర్యానీని ఇక జన్మలో తినబోను.. ఇంట్లో వండబోనని రూబీ తెలిపింది.

Also Read:  Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?

Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు