Telangana: మహిళలకు గుడ్ న్యూస్ .. స్టాంప్ డ్యూటీలో రాయితీ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో చర్యలు తీసుకుంటుందని తెలిపారు.