/rtv/media/media_files/2025/07/05/air-india-pilot-collapses-before-operating-bengaluru-delhi-flight-2025-07-05-14-39-31.jpg)
air india pilot collapses before operating bengaluru delhi flight
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత అందరిలోనూ భయం పట్టుకుంది. విమానం సవ్యంగా గమ్యస్థానానికి చేర్చుతుందా? లేదా? అనే అనుమానం ఇప్పుడు విమాన ప్రయాణికుల్లో మొదలైంది. వారి భయానికి తగ్గట్టుగానే తరచూ ఏదో ఒక విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం మరింత కంగారు పెట్టిస్తోంది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!
Also Read : జరగబోయేది ముందే చెప్పే ఫేమస్ జ్యోతిష్యులు వీరే
Air India Pilot Collapses
విమానం మరో 5 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ఇంతలో పైలట్ తన ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అంతలో ఒక్కసారిగా ఆ పైలట్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించి.. ఆ విమానంలో మరో పైలట్‌ను పంపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
@DGCAIndia@RamMNK
— Daedalus (@Daedalusflew) July 4, 2025
Heard an airline Captain of @airindia
collapsed today just before operating the flight BLR DEL early morning and he is still in hospital. pic.twitter.com/Akypxsi6Cq
ఎయిర్ ఇండియా విమానం AI2414 బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. విమానం టేకాఫ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు ఓ పైలట్ కాక్ పిట్‌లో ఉండగానే విమానం నడిపేందుకు అవసరమైన తప్పనిసరి డాక్యుమెంట్స్ (టెక్ లాగ్) పై సంతకం చేస్తున్నాడు. అదే సమయంలో అతడు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సడెన్‌గా కుప్పకూలిపోయాడు.
వెంటనే అధికారులు ఆ పైలట్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఆ విమానంలో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎయిర్ ఇండియా అధికారులు వెంటనే మరొక పైలట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ విమానం సేఫ్‌గా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆ పైలట్ కోలుకుంటున్నాడని తెలిసింది. ఈ ఘటనతో చాలా మంది ఊపిరిపీల్చుకుంటున్నారు. విమానం బయల్దేరే ముందు ఇలా జరగడం మంచిదైందని.. ఒకవేళ విమానం గాల్లో ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది అని అంతా మాట్లాడుకుంటున్నారు.
Also Read : తెలంగాణలో దారుణం.. భార్య చేతిలో మరో భర్త బలి..ప్రియుడి మోజులో పడి
air india plane crash | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu | Air India Pilot Collapses