/rtv/media/media_files/2025/07/06/ponguleti-srinivasa-reddy-2025-07-06-06-56-17.jpg)
Ponguleti Srinivasa reddy
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో చర్యలు తీసుకుంటుందని.. ఇందులో భాగంగానే స్టాంప్ డ్యూటీ తగ్గించాలని ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 2021లో భారతీయ స్టాంపుల చట్టంలో నాలుగు సెక్షన్లు, 26 ఆర్టికల్స్‌పై అసెంబ్లీలో సవరణ బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపగా పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ
Discount For Women In Stamp Duty
వీటిపై వివరణలు పంపినప్పటి కూడా 2023లో ఆ బిల్లును తిరిగి తెలంగాణకే పంపింది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ల చట్టంలో చేసే సవరణలపై సచివాలయంలో శనివారం సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూశాఖ సెక్రటరీ డీఎస్ లోకేశ్ కుమార్ తదితరులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు.
Also Read: ట్రంప్‌కు ఝలక్ ఇచ్చిన ఎలాన్‌మస్క్..కొత్త పార్టీ ప్రారంభం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '' ప్రస్తుతం 2-025 సవరణ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరణ సవరణను చేపట్టాలి. మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త, పాత అపార్ట్‌మెంట్లకు స్టాంప్ డ్యూటీ ఒకేలా ఉంది. పాత వాటి రిజిస్ట్రేషన్ల తేదీలను పరిగణలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీ తగ్గించాలని భావిస్తున్నాం. మహిళలు, పాత అపార్ట్‌మెంట్ల స్టాంప్ డ్యూటీ తగ్గింపు అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని'' పొంగులేటి అన్నారు.
Also Read : ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య!.. చెట్టుకు వేలాడుతూ
Also Read : మహిళామణులకు గుడ్‌న్యూస్.. విజయదశమికి వారికి చీరల పంపిణీ
ponguleti-srinivas | latest-telugu-news | latest telangana news | today-news-in-telugu