/rtv/media/media_files/2025/07/03/bihar-woman-kills-husband-days-after-wedding-2025-07-03-12-56-15.jpg)
Bihar Aurangabad Woman Kills Husband Days After Marriage
బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లైన 45 రోజులకే ఓ భార్య తన మామతో కలిసి భర్తను లేపేసింది. పక్కా ప్లాన్ ప్రకారమే.. ఈ ఇద్దరూ కలిసి సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే మామ, కోడలు మధ్య అక్రమ సంబంధమే దీనికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : ఎవరికీ భయపడేది లేదు.. కొండా మురళి సంచలన కామెంట్స్
Woman Kills Husband
గుంజా దేవి అనే యువతికి, నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్వాన్ గ్రామానికి చెందిన జీవన్‌సింగ్‌తో గత కొంతకాలంగా ప్రేమాయణం నడిచింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు. ఇదే విషయాన్ని ఆ యువతి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ వారు దానికి అంగీకరించలేదు. అనంతరం రెండు నెలల క్రితం అంటే మే నెలలో గుంజా దేవిని.. ఆమె ప్రియుడు జీవన్‌సింగ్ కొడుకు ప్రియాంషుకి ఇచ్చి బలవంతంగా మ్యారేజ్ చేశారు.
Also Read : అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 5గురు మృతి - అందులో నలుగురు చిన్నారులు
అనంతరం ఎలాగైన తన భర్త ప్రియాంషును హత మార్చి మామతో కలిసుండాలని గుంజా దేవి ప్లాన్ వేసుకుంది. ఈ మేరకు తన మామ, ప్రియుడు జీవన్‌సింగ్‌తో ప్రణాళిక గీసింది. ఇందులో భాగంగానే జూన్ 25న భర్త ప్రియాంషు తన సోదరిని కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతనిని కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. గుంజా దేవి ఊరు విడిచి పారిపోవడానికి ప్రయత్నించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఫోన్‌ను చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. ఆమె తన మామతో తరచూ టచ్‌లో ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా మామ జీవన్‌సింగ్ కాల్ రికార్డులు పరిశీలించగా.. అతడు కాల్పులు జరిపిన వ్యక్తులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో మామ, కోడలు కలిసే ప్రియాంషుని హతమార్చినట్లు నిర్థారణకు వచ్చారు. వెంటనే ఈ మర్డర్‌కు ప్లాన్ వేసిన గుంజాదేవిని, అలాగే ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జీవన్‌సింగ్ కోసం గాలిస్తున్నారు.
Also Read : 16 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 40 ఏళ్ల స్కూల్ టీచర్
దీనిపై ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘ఈ హత్యపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశాం. ప్రియాంషు, దేవి వివాహం జరిగిన 45 రోజుల తర్వాత ఈ హత్య జరిగింది. దేవితో సహా ముగ్గురిని అరెస్టు చేశాం. సింగ్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.’’ అని తెలిపారు.
Woman kills husband with boyfriend | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu crime news | bihar | national news in Telugu