Spicejet: విమానం గాల్లో ఉండగా తెరుచుకున్న కిటికీ.. వీడియో వైరల్

గోవా నుంచి పుణె వెళ్తున్న స్పేస్‌జెట్‌ విమానంలో గాల్లో ఉండగానే ఓ కిటికీ ఫ్రేమ్‌ తెరుచుకుంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. చివరికి ఆ విమానం పుణె ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

New Update
SpiceJet aircraft's window frame comes loose mid-air, airline says no risk

SpiceJet aircraft's window frame comes loose mid-air, airline says no risk

ఈ మధ్యకాలంలో తరచుగా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. దీనివల్ల వాటిని వెనక్కి మళ్లించడం, అత్యవసరం ల్యాండింగ్ చేయడం లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా మరో విమానం ప్రమాదం నుంచి తప్పించుకుంది. గోవా నుంచి పుణె వెళ్తున్న స్పేస్‌జెట్‌ విమానంలో గాల్లో ఉండగానే ఓ కిటికీ ఫ్రేమ్‌ తెరుచుకుంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. చివరికి ఆ విమానం పుణె ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: దారుణం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి డెలివరీ బాయ్ మృతి.. 22వ అంతస్తులో ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి!

SpiceJet Aircraft

Also Read :  తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో భక్తులు పరుగో పరుగు

ఇదిలాఉండగా మంగళవారం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పటికి విమానంలో 222 మంది ప్రయాణికులు ఉన్నారు.ఇటీవల మరో ఇండిగో ఫ్లైట్‌ ప్రమాదానికి గురైంది. గువాహాటి నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానం ప్రమాదంలో పడింది. దీంతో పైలట్లు మేడే సందేశం ఇచ్చారు. ఆ తర్వాత విమానాన్ని బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో 168 మంది ప్రయాణికులు ఉన్నారు.

Also Read: లేడీస్ బాత్‌రూమ్‌లో ఏపీ టెకీ పాడుపని.. చివరికి ఇలా దొరికేశాడు

మరోవైపు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బుధవారం వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలు దారిమళ్లించారు. ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలను బెంగళూరుకు మళ్లించారు. మంబాయి -శంషాబాద్‌ , వైజాగ్‌ -శంషాబాద్‌, జైపూర్‌ -శంషాబాద్‌ విమానాలను బెంగళూరుకు మళ్లించారు.

Also Read :  జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

rtv-news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు