MP: ఆఫ్రికా నుంచి మరో 8 చీతాలు భారత్ కు..
దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మరో 8 చీతాలు భారతదేశానికి రానున్నాయి. రెండు విడతల్లో ఇవి ఇక్కడకు వస్తాయి. మేలో 4...ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ తెలిపింది.
దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మరో 8 చీతాలు భారతదేశానికి రానున్నాయి. రెండు విడతల్లో ఇవి ఇక్కడకు వస్తాయి. మేలో 4...ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ తెలిపింది.
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలను ఎన్టీయే నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది. అయితే ఇప్పుడు అందులో 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసింది. వారు ఫోర్జరీ దస్త్రాలు ఉపయోగించారని గుర్తించామని ఎన్టీఏ అధికారులు తెలిపారు.
నిన్న సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్ (CMS) కొత్త అధిపతిగా ఓజ్ ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతుండగా ఓజ్ కుమార్తె స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆ సమావేశాన్ని వెంటనే ఆపేయాల్సి వచ్చింది.
అత్యాచారం చేసిన యువకుడికి గ్రామస్తులే బుద్ధి చెప్పారు. అతడిని నగ్నంగా మార్చి...ఎడ్ల బండికి కట్టేశారు. దాని తరువాత అతనిని పిచ్చ కొట్టుడు కొట్టారు. ఆ తరువాత దీనికి సంబంధించిన వీడియోను గ్రామస్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ కుమార్తె పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. ఆయన కూతురు హర్షిత వివాహం తన స్నేహితుడు సంభవ్ జైన్ తో నిన్న రాత్రి వివాహం అయింది. ఇందులో కేజ్రీవాల్ ఆయన భార్య పుష్ప 2 సాంగ్ కు డాన్స్ చేశారు.
చైనా అన్నిరకాలుగా భారత్ తో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 85 వీసాలను మంజూరు చేసిన డ్రాగన్ కంట్రీ మరో కీకల మలుపుకు తెర తీసింది. ఐదేళ్ళుగా నిలిచిపోయిన మానస సరోవర యాత్రను తిరిగి ప్రారంభించడానికి రెండు దేశాలు అంగీకరించాయి.
వక్ఫ్ చట్టం పశ్చిమ బెంగాల్ లో ఆందోళనలు, ఘర్షణలుకు దారి తీసింది. దీనిపై పక్కనే ఉన్న బంగ్లాదేశ్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు భద్రత కల్పించాలని వ్యాఖ్యలు చేసింది. దీనికి ప్రతిగా ముందు మీ దేశం గురించి మీరు చూసుకుంటే మంచిదంటే భారత్ కౌంటరిచ్చింది.
శాటిలైట్ ఆధారిత టోల్ విధానంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
అసలు మ్యాచ్ అవుతుందా లేదా అనుకున్నారు. చివరకు లేట్ గా స్టార్ట్ అయి 14 ఓవర్లతో మ్యాచ్ ను నిర్వహించారు. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 95 పరుగులు చేయగా... పంజాబ్ దానిని కేవలం 12 ఓవర్లలోనే ఛేదించింది.