/rtv/media/media_files/2025/10/09/trump-vs-chivago-2025-10-09-06-44-29.jpg)
అమెరికాలోని పలు నగరాల్లో అధ్యక్షుడు ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను డిప్లాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో షికాగోకు కూడా 400 మంది కేంద్ర బలగాలను పంపించారు. ఈ క్రమంలో షికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్, ఇల్లినోయీ గవర్నర్ జేబీ ఫ్రిట్కర్‌లపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షికాగోలో ప్రభుత్వ సంస్థలను రక్షించడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. అక్కడి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు భద్రత కల్పించలేకపోయారని...ఇందుకు గానూ మేయర్, గవర్నర్ లను జైల్లో పెట్టాలని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ట్రంప్ బెదిరింపుపై గవర్నర్ ప్రిట్జ్ కర్ స్పందించారు. నా ప్రజలను కాపాడుకోవడానికి తాను ఎప్పుడూ ముందుంటానని..రండి నన్ను అరెస్ట్ చేయండి అంటూ ప్రకటించారు. దాంతో పాటూ ట్రంప్ ఒక నియంత అంటూ ఆరోపించారు.
IL Gov JB Pritzker taunts Trump: "If you come for my people, you come through me. So come & get me!"
— SpeedySMM (@speedysmm4547) October 9, 2025
"His people" means criminal illegal aliens? How many does he "own" exactly?
Leaders must put citizens first, not lawbreakers.
Rule of law, not drama!pic.twitter.com/mqytL27yox
అక్రమ వలసల కట్టడిపై షికాగో ప్రజల ఆందోళన..
ట్రంప్ పరిపాలనలోకి వచ్చాక అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేస్తున్నారు. చాలా మందిని విమానాలు పెట్టి మరీ స్వదేశాలకు పంపించేశారు. దాని తరువాత ఒక్కో రాష్ట్రంలో అక్రమ వలసదారులను ఏరి వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. లాస్ ఏంజెలెస్ లో కూడా సడెన్ గా అక్రమ వలసదారులపై అటాక్ చేయడంతో అక్కడ నిరసనలు చుట్టుముట్టాయి. దాని తరువాత షికాగోలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తనిఖీలు చేసేందుకు వచ్చిన ఇమ్మిగ్రేషన్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో షికాగోలోని వలస సేవల కేంద్రాల దగ్గర తరచూ ఆందోళనలు జరుగుతున్నాయి. వీటిని అణిచి వేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. షికాగోలో నేరాలను ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుతూనే ఉన్నారు. కానీ షికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్, ఇల్లినోయీ గవర్నర్ జేబీ ఫ్రిట్కర్ లు ట్రంప్ ఆదేశాలను ఖండిస్తూ వచ్చారు. చివరకు నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపారు. ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అయితే అధ్యక్షుడి చర్యలను ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ఫ్రిట్కర్ మండిపడుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న నగరాలకే ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను పంపించడం దారుణమని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ చాలా నగరాల్లో నేషనల్ గార్డ్స్ ను మోహరించారు. బాల్టిమోర్, మెంఫిస్, ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, న్యూ ఆర్లీన్స్, ఓక్‌లాండ్, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్ , వాషింగ్టన్ డీపీ లతో పాటూ షికాగో, టెక్సాస్ లకు కూడా కేంద్ర బలగాలను పంపించారు. వీటి తర్వాత పోర్ట్ ల్యాండ్ కు కూడా పంపాలని అనుకున్నారు. అయితే అక్కడ ఫెడరల్ కోర్టు దీనికి అడ్డుకట్ట వేసింది. కేవలం చిన్న ఆందోళనలను కారణంగా చూపి కేంద్ర బలగాలను పంపాలని నిర్ణయించడం అనుచితమని కోర్టు తీర్పు చెప్పింది.
Also Read: Gaza Peace Plan: గాజా శాంతి ఒప్పందం మొదటి దశపై సంతకం చేసిన ఇజ్రాయెల్ , హమాస్