Stock Market: డిసెంబర్7 నుంచి మారనున్న స్టాక్ మార్కెట్ ..బ్లాక్ డీల్స్ కు కొత్త రూల్స్

డిసెంబర్ 7, 2025 నుంచి స్టాక్ మార్కెట్ రూల్స్ మారుతున్నాయి. బ్లాక్ డీల్స్ ను మరింత కఠినతరం చేస్తూ సెబీ పెద్ద మార్పును చేసింది. కనీస ఆర్డర్ ను 10 కోట్ల నుంచి 25 కు పెంచారు. 

New Update
sebi

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) స్టాక్ మార్కెట్‌లో ఒక పెద్ద మార్పు చేసింది. బ్లాక్ డీల్స్ నియమాలను మరింత కఠినతరం చేసింది. బ్లాక్ డీల్స్ కనీస ఆర్డర్ పరిమాణాన్ని ₹10 కోట్ల నుండి ₹25 కోట్లకు పెంచుతూ నిర్ణయాన్ని తీసుకుంది.  ఈ కొత్త రూల్ డిసెంబర్7, 2025 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన సర్క్యులర్ ను సెబీ నిన్న విడుదల చేసింది. స్టాక్స్ కొనేవారు అందరూ దీన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలని చెప్పింది. అలాగే ఈ సర్క్యులర్ ను అందరు పెట్టుబడిదారులు, మార్కెట్లను ఫాలో అయ్యేవారితో పాటూ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్ సైట్లలో పోస్ట్ చేయాలని సెబీ ఆదేశించింది. ఈ నియమాలు సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుండి 60 రోజుల తర్వాత, అంటే డిసెంబర్ 7, 2025 నుండి అమలులోకి వస్తాయి. 

బ్లాక్ డీల్స్ కొత్త నియమాలు..

సీఎన్బీసీ నివేదిక ప్రకారం...బ్లాక్ డీల్స్ రూల్స్ అమల్లోకి వచ్చాక దీని ఫ్లోర్ ధ మునుపటి రోజు ముగింపు ధర కంటే 3శాతం ఎక్కువగా లేదా తక్కువగా ఉండొచ్చని సెబీ తెలిపింది. అంతకు ముందు దీని పరిమితి 1శాతం మాత్రమే ఉండేది. అంటే బ్లాక్ డీల్స్ ఇప్పుడు ధర నిర్ణయాలలో కొంచెం ఎక్కువ వెసులుబాటును అందించనున్నాయి. దీంతో పాటూ బ్లాక్ డీల్స్ కోసం ఇక మీదట రెండు టైమ్ విండోస్  సెట్ చేయనున్నారు. మొదటి విండో ఉదయం 8:45 నుండి 9:00 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో, ఫ్లోర్ ధర మునుపటి రోజు ముగింపు ధరగా ఉంటుంది. రెండవ విండో మధ్యాహ్నం 2:05 నుండి 2:20 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో, ఫ్లోర్ ధర మధ్యాహ్నం 1:45 నుంచి  2:00 గంటల మధ్య నగదు విభాగంలో ట్రేడింగ్ వాల్యూమ్-వెయిటెడ్ సగటు ధర (VWAP) ఆధారంగా ఉంటుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలు మధ్యాహ్నం 2:00 నుంచి 2:05 గంటల మధ్య VWAP సమాచారాన్ని పంచుకుంటాయి.  

కొత్త రూల్స్ ప్రకారం..బ్లాక్ డీల్ లో ఆర్డర్ ధర...ఫ్లోర్ ధరలో ౩శాతంగా పరిమితం చేయనున్నారు. ఇది పర్యవేక్షణ, రివర్తించే ధరల బ్యాండ్ ల ప్రకారం పని చేస్తుంది. కానీ ప్రతీ బ్లాక్ డీల్ ధర కనీసం 25 కోట్ల విలువ కలిగి ఉండాలి. ఈ ఆర్టర్లను రద్దు చేయడం కానీ మార్చడం కానీ ఉండదు. అలాగే స్టాక్ పేరు, క్లయింట్ పేరు, కొనుగోలు చేసిన లేదా విక్రయించిన షేర్ల సంఖ్య.. ట్రేడ్ ధర లాంటి అన్ని బ్లాక్ డీల్ వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు అదే రోజు మార్కెట్ పనివేళల తర్వాత బహిరంగపరచవలసి ఉంటుంది.

Also Read:  Top Universities: వరల్డ్ టాప్ హండ్రెడ్ లో భారత యూనివర్శిటీలకు దక్కని చోటు..పధ్నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి

Advertisment
తాజా కథనాలు