Women's World Cup: వరల్డ్ కప్ లో భారత మహిళలకు మొదటి ఓటమి..సౌతాఫ్రికా చేతిలో..

మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ కు మొదటి ఓటమి ఎదురైంది. ఈరోజు జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియాపై సౌత్ ఆఫ్రికా 3వికెట్లు తేడాతో గెలిచింది.  మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 251 పరుగులకు ఆలౌట్ అయింది.

New Update
india vs south africa

ఈరోజు వైజాగ్ లో జరిగిన జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 251 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టులో రిచా ఘోష్ 94 పరుగులతో మెరిసింది. తరువాత లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్లు కోల్పోయి 48.5 ఓవర్లలో 251 పరుగులను చేశారు. నాడిన్ డిక్లర్క్ (84*), కెప్టెన్ వొల్వార్ట్ (70), క్లో ట్రైయాన్ (49) రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి 2, స్నేహ్ రాణా 2, అమన్‌జ్యోత్, చరణి, దీప్తి ఒక్కో వికెట్ పడగొట్టారు.

రెచ్చిపోయిన రిచా..

మొదట బ్యాటింగ్ చేసిన భారత టీమ్ లో కీలక బ్యాటర్లు అందరూ త్వరగా వికెట్లు కోల్పోయారు. ఈ టైమ్ లో ఎనిమిదో ప్లేస్ లో వచ్చిన రిచా ఘోష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (37), స్మృతి మంధాన (23) శుభారంభం అందించినా తర్వాత వచ్చిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోయారు. స్నేహ్ రాణా మాత్రం 33 పరుగులతో పర్వాలేదనిపించింది. హర్లీన్‌ డియోల్ (13), హర్మన్‌ప్రీత్ కౌర్ (9), దీప్తి శర్మ (4), జెమీమా రోడ్రిగ్స్ (0) పరుగులు చేశారు. ఒక దశలో 83/1తో ఉన్న భారత్.. ఉన్నట్టుండి వికెట్లు కోల్పోయి 102/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో అమన్‌జ్యోత్‌, స్నేహ్ రాణాతో కలిసి రిచా ఘోష్‌ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. కేవలం 53 బంతుల్లో అర్థ శతకం సాధించిన రిచా...తరువాత వరుసగా షాట్లు కొడుతూ చెలరేగిపోయింది. ఆయబొంగా వేసిన 47 ఓవర్‌లో వరుసగా 4, 4, 6 బాదేసింది. నిజానికి రిచా సెచరీ చేస్తుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా లాంగాన్ లో ట్రైయాన్ కు చిక్కి అవుట్ అయిపోయింది.         

Advertisment
తాజా కథనాలు