UP: కాన్పూర్ లో స్కూటర్లలో పేలుడు..పలువురికి గాయాలు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో మర్కజ్ మసీదు దగ్గరలో ఈరోజు సాయంత్రం పేలుళ్ళు సంభవించాయి. పార్క్ చేసి ఉన్న స్కూటర్లలో పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. 

New Update
kanpur

ఉత్తరప్రదేశ్ లోని కాన్సూర్ లో జరిగిన ఘటన అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. అక్కడ స్కూర్లలో హఠాత్తుగా పేలుళ్ళు సంభవించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాన్పూర్ లోని మర్కజ్ దగ్గరలో ఈ రోజు సాయంత్రం ఈ ఘటన జరిగింది.  మూల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రీ బజార్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పాక్క చేసి ఉన్న స్కూటర్లలో ఇవి జరిగాయి. దీంతో సమీపంలో ఉన్న ఇళ్ళు, దుకాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. మొత్తం ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని సమాచారం. పేలుళ్ల శబ్ధం 500 మీటర్ల వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. 

కారణాలు పరిశీలిస్తున్న పోలీసులు

పేలుళ్ళు సంభవించిన కొద్దిసేపటికే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పేలుడు సభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన వారిని పోలీసులు ఉర్సులా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ పేలుళ్ళు ప్రమాదవశాత్తు జరిగాయా లేక ఏదైనా కుట్రా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాతే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని జాయింట్ పోలీస్ కమిషనర్ అశుతోష్ కుమార్ చెప్పారు.


  

Advertisment
తాజా కథనాలు