Top Universities: వరల్డ్ టాప్ హండ్రెడ్ లో భారత యూనివర్శిటీలకు దక్కని చోటు..పధ్నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి

ప్రపంచ అగ్ర యూనివర్శిటీ జాబితాలో ఈసారి భారత్ కు చోటు దక్కలేదు. పధ్నాలుగేళ్ళల్లో మొట్టమొదటిసారిగా ఒక్క ఇండియన్ యూనివర్శిటీ కూడా టాప్ ర్యాకింగ్ సంపాదించుకోలేకపోయింది. 

New Update
indian universities

 ప్రతీ ఏడాది వరల్డ్ టాప్ యూనివర్శిటీ జాబితాను విడుదల చేస్తారు. ఈ లిస్ట్ లో భారత యనివర్శిటీలు ఒకటి, రెండైనా వందలో స్థానాన్ని ంపాదిస్తాయి. కానీ ఈసారి మాత్రం నిరాశే ఎదురైంది. టాప్ హండ్రెడ్ యూనివర్శిటీల్లో ఒక్క ఇండిన్ యూనివర్శిటీ కూడా లేదు. ఇలా జరగడం పధ్నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి. మరోవైపు హైయ్యర్ ఎడ్యుకేషన్ కు పెట్టింది పేరైన అమెరికా యూనివర్శిటీలు సైతం తమ మొదటి స్థానాలను కోల్పోయాయి. 

మొదటి స్థానం ఎప్పటిలానే ఆక్స్ ఫర్డ్ కే...

2026 టాప్ యూనివర్శిటీల లిస్ట్ లో ఈసారి కూడా నంబర్ వన్ స్థానాన్ని యూకేకు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ దక్కించుకుంది. గత పదేళ్ళుగా నబర్ వన్ ప్లేస్ లో ఈ యూనివర్సిటీనే వస్తోంది.  దీని తరువాతి స్థానంలో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. మూడవ ప్లేస్ ను కూడా యునైటెడ్ స్టేట్స్ కే చెందిన ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం దక్కించుకుంది. టాప్ పది ప్లేసెన్ లో ఏడు అమెరికా విశ్వవిద్యాలయాలు ఉండగా..మూడు యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన యూనివర్శిటీలు ఉన్నాయి.

ఆసియాలో చైనా టాప్..

ఆసియాకు సంబంధించి సింఘవా విశ్వవిద్యాలయం 12వ స్థానంలో, పెకింగ్ యూనివర్శిటీ 13వ స్థానంలో, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ 17వ స్థానంలో ఉన్నాయి. చైనాకు చెందిన మిగతా యూనివర్శిటీలు అన్నీ కూడా టాప్ 40లోపు స్థానాలను దక్కించుకున్నాయి.  మిగతా దేశాలకు చెందిన యూనివర్శిటీలు ఏవీ టాప్ 100లో లేవు. 2024 వరకు టాప్ లో నిలిచిన ఆసియా విశ్వవిద్యాలయాలు...తరువాత మాత్రం వెనకబడుతూ వస్తున్నాయి. 

200 నుంచి 1000 లోపు భారత యూనివర్శిటీలు..

భారత్ కు సంబంధించి యూనివర్శిటీలు అన్నీ 200 నుంచి 1000 లోపు స్థానాలను దక్కించుకున్నాయి. మొత్తం అన్ని యూనివర్శటీల కంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈసారి టాప్ గా నిలిచింది. ఇది 200 నుంచి  250 మధ్యలో స్థానాన్ని దక్కించుకుంది. దీని తరువాత ఇండియా నుంచి సవీత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, జామియా మిలియా ఇస్లామియా, షూలిని యూనివర్శిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఐఐటీ ఇండోర్, లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, యుపిఇఎస్, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం లు ఉన్నాయి. 

Also Read: Gaza Peace plan: ఇది ఇజ్రాయెల్ నైతిక విజయం...బందీల విడుదలపై నెతన్యాహు ఎమోషనల్ పోస్ట్

Advertisment
తాజా కథనాలు