USA-India: భారత్ తో సంబంధాలు వెంటనే పునరుద్ధరించండి..ట్రంప్ సెనేట్ సభ్యుల లేఖ

గత కొంతకాలంగా ఇండియాతో దెబ్బతిన్న దౌత్య సంబంధాలను వెంటనే పునరుద్ధరించుకోవాలని కోరుతూ అమెరికా చట్ట సభ్యులు అధ్యక్షుడు ట్రంప్ కు లేఖ రాశారు. ఇందులో మిత్రదేశంగా భారత్ అవసరం అమెరికాకు ఎంతో ఉందని సెనేటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

New Update
modi-trump

PM Modi- Trump

కొంత కాలంగా అమెరికా, భారత్ ల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా అధ్యక్షుడు ట్రంప్...ఇండియాపై అదనపు సుంకాలను విధించారు. దాంతో పాటూ హెచ్ 1బీ రూల్స్ కఠినతరం చేయడం, వాణిజ్య చర్యలు ఆగిపోవడం లాంటి వాటి వలన ఇరు దేశాల మధ్యనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ మధ్యనే భారత్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్యా మళ్ళీ వాణిజ్య చర్యలు మొదలయ్యాయి. అయితే సుంకాల విషయంలో మాత్రం ఇంకా అమెరికా త్గననే చెబుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపే వరకు టారిఫ్ లను తగ్గించేది లేదని తెగేసి చెబుతున్నారు.

ఆ దేశం అమెరికాకు ఎంతో ముఖ్యం.. 

ఇప్పుడు దీనిపై తాజాగా అమెరికా చట్టసభ సభ్యులు అధ్యక్షుడు ట్రంప్ కు లేఖ రాశారు. భారత్ తో సంబంధాలు వెంటనే పునరుద్ధరించుకోవాలని చెప్పారు. మొత్తం 19 మంది సెనేట్ సభ్యులు ట్రంప్ కు లేఖ రాశారు. ఇందులో ప్రముఖ డెమెక్రాట్‌ నేత దెబోరా రాస్‌, రోఖన్నా తదితరులు ఉన్నారు. ఇండియా ఉత్పత్తులపై సుంకాలు విధించడం వలన ఆ దేశ ఉత్పత్తిదారులతో పాటూ అమెరికాలో వినియోగదారులు కూడా నష్టపోయారని అందులో పేర్కొన్నారు. అతి పెద్ద దేశాల్లో ఒకటైన భారత్ కు వ్యతిరేకంగా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవరంగా దెబ్బ తిన్నాయని అన్నారు. దీని వలన రెండు దేశాలకూ మంచి జరగలేదని అభిప్రాయం వ్యక్త పరిచారు. భారత్‌తో బలమైన కుటుంబ, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు కలిగిన ఇండియన్‌-అమెరికన్‌ కమ్యూనిటీలు నివసిస్తున్న ప్రాంతాలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని..ఇటు వంటి కీలకమైన భాగస్వామ్యాన్ని వెంటనే బాగుపరిచే బాధ్యత అధ్యక్షుడి మీద ఉందని సెనేట్ సభ్యులు కోరారు. 

అమెరికన్ కంపెనీలు ఉత్పత్తులను మార్కెట్‌లోకి  తీసుకురావడానికి ఆధారపడిన సరఫరా గొలుసులను దెబ్బతీస్తున్నాయని చట్ట సభ్యులు అన్నారు. సెమీకండక్టర్ల నుండి ఆరోగ్య సంరక్షణ, ఇంధనం వరకు అన్ని రంగాలలోని కీలక ఇన్‌పుట్‌ల కోసం అమెరికన్ తయారీదారులు ఎక్కువగా భారతదేశంపై ఆధారపడతారని చెబుతూ.. వాణిజ్య భాగస్వామిగా భారతదేశం యొక్క ప్రాముఖ్యతను కాంగ్రెస్ సభ్యులు హైలైట్ చేశారు. "భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అమెరికన్ సంస్థల పోటీపడే సామర్థాన్ని ట్రంప్ నిర్ణయాలు దెబ్బ తీస్తున్నాయన్నారు. USలో భారతీయ పెట్టుబడులు స్థానిక సమాజాలకు ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాలను సృష్టించాయని వారు రాశారు. అంతేకాదు అమెరికాకు అతి పెద్ద పోటీ అయిన చైనాను కౌంటర్ చేయాలంటే భారత్ లాంటి దేశాల సహకారం ఎంతో అవసరమని అన్నారు. క్వాడ్‌లో భాగంగా ఉన్న భారత్‌.. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఇటువంటి సమయంలో ఇండియా.. ఇలా రష్యా, చైనాకు దగ్గరకావడం చాలా ఆందోళన కలిగించే పరిణామమని చట్ట సభ్యులు పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో అమెరికాకు ఎంతో మంచి భాగస్వామి అయిన ఇండియాను దూరం చేసుకోవడం మంచిది కాదని సభ్యులు చెప్పారు. రక్షణ, ప్రాంతీయ భద్రత, ఇంధన మార్కెట్లు, ఆవిష్కరణలు వంటి వాటిలో అమెరికా, భారత్‌ సహకారం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని...ఆ దేశంతో సంబంధాలు పునరుద్ధరించుకోవడం చాలా అవసరమని నొక్కి వక్కాణించారు. 

Also Read: Trump Vs Chicago: ముదురుతున్న షికాగో వ్యవహారం..అక్కడ మేయర్ ను జైలుకు పంపాలన్న ట్రంప్

Advertisment
తాజా కథనాలు