ISRO: ఈ రోజే ఎల్ఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం
ఇస్రో ఈ రోజు మరో కొత్త ప్రయోగం చేపట్టడానికి సిద్ధమైంది. షార్ లో ఈరోజు సాయంత్రం 5.26 గంటలకు ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా సీఎంఎస్-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు.
ఇస్రో ఈ రోజు మరో కొత్త ప్రయోగం చేపట్టడానికి సిద్ధమైంది. షార్ లో ఈరోజు సాయంత్రం 5.26 గంటలకు ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా సీఎంఎస్-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు.
గత నెల రోజులుగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతోంది. దీని కారణంగా అక్కడి కార్యకలాపాలు అన్నీ ఆగిపోయాయి. దీని కారణంగా దాదాపు రూ.62 వేల కోట్లకు పైగా సంపద ఆవిరి అయిందని అధికారులు చెబుతున్నారు.
ఈ రోజు సాయంత్రం లడఖ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. లేహ్ లో కూడా భూకంపం వచ్చిందని తెలుస్తోంది. భయంతో జనాలు ఇళ్ళను నుంచి బయటకు పరుగులు తీశారు.
భారత్ లో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ అవతరించిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. కేరళ ఆవిర్భావ దినోత్సవంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తెలిపారు.
అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తి బంకిమ్ బ్రహ్మభట్ 500 మిలియన్ల ఫ్రాడ్ కు పాల్పడ్డారంటూ నేరారోపణలను ఎదుర్కంటున్నారు. తప్పుడు ఆదాయ మార్గాలను చూపించి అప్పులను తీసుకుని ఎగ్గొట్టారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఉటంకించింది.
ప్రస్తుతం పాకిస్తాన్ చాలా కష్టాల్లో ఉందని చెబుతోంది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. దీని నివేదిక ప్రకారం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేశాక పాకిస్తాన్ నీటి కొరతో ఇబ్బంది పడుతోంది.
పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేందుకు భారత్ దారిలోనే ఆఫ్ఘాన్ కూడా నడుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే కునార్ నదిపై డ్యామ్ ను నిర్మించాలని భావిస్తోంది. దీనికి భారత్ మద్దతు తెలిపింది.
ఇండియా , అమెరికాల మధ్య నెమ్మదిగా మళ్ళీ దోస్తీ కుదురుతోంది. తాజాగా రెండు దేశాల మధ్యా కీలక డీల్ కుదిరింది. తమ సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు.. భారత్, అమెరికాలు ఒక కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.