Kerala: అత్యంత  పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ

భారత్ లో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ అవతరించిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. కేరళ ఆవిర్భావ దినోత్సవంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తెలిపారు. 

New Update
Kerala CM Pinarayi vijayan

Kerala CM Pinarayi vijayan

అత్యంత ఎక్కువ లిటరసీ ఉన్న రాష్ట్రంగా ఇప్పటికే వెలుగొందుతున్న కేరళ ఇప్పుడు మరో పెద్ద విజయాన్ని సాధించింది. అత్యంత పేదరికాన్ని తెలిగించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. భారత్ లో కేరళనే మొదట ఈ విజయాన్ని సాధించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెసరయి విజయన్ తెలిపారు. కేరళ ఆవిర్భావ దినోత్సవంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తెలిపారు. దీంతో కేరళ పిరవి చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు. ఈ శాసనసభ అనేక చారిత్రాత్మక చట్టాలు, విధాన ప్రకటనలకు సాక్ష్యంగా నిలిచింది. నవ కేరళ సృష్టిలో మరో మైలురాయిని గుర్తించే సమయంలో అసెంబ్లీ ఇప్పుడు సమావేశమవుతోంది అంటూ అసెంబ్లీ విజయన్ మాట్లాడారు. 

2021 నుంచి ఇప్పటి వరకు..

2021లో 2021లో కొత్త మంత్రిత్వ శాఖ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలలో పేదరిక నిర్మూలన ఒకటి అని ముఖ్యమంత్రి తెలిపారు. శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అతి ముఖ్యమైన వాగ్దానాలలో ఒకదాన్ని నెరవేర్చడానికి ఇది నాంది అని...దాన్ని ఈనాటికి పూర్తి చేయగలిగామని చెప్పారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రతిపక్షం విజయన్ ప్రకటనలను "శుద్ధ మోసం" అని అభివర్ణించింది. ఇందుకు నిరసనగా సెషన్‌ను బహిష్కరించింది.

భారతదేశంలో 100 శాతం అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి రాష్ట్రం, మొదటి డిజిటల్ అక్షరాస్యత, పూర్తిగా విద్యుదీకరణ చెందిన రాష్ట్రం అయిన కేరళలో ప్రభుత్వం..  పేదరికం నుండి తమ ప్రజలను బయటపడేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వం 20,648 కుటుంబాలకు రోజువారీ ఆహారాన్ని అందించింది. వారిలో 2,210 మందికి వేడి భోజనం, 85,721 మందికి అవసరమైన చికిత్స, మందులు...దాంతో పాటూ వేలాది మందికి గృహాలను కూడా నిర్మించి ఇచ్చింది. అంతేకాకుండా, 21,263 మందికి రేషన్ కార్డులు, ఆధార్, పెన్షన్లు వంటి ముఖ్యమైన పత్రాలు మొదటిసారిగా లభించాయని సీఎం విజయన్ తెలిపారు.  4,394 కుటుంబాలకు జీవనోపాధి ప్రాజెక్టుల ద్వారా మద్దతు లభిస్తుందని చెప్పారు. అందరికీ ఒకే విధానానికి బదులుగా, ప్రభుత్వం 64,006 దుర్బల కుటుంబాలను గుర్తించి, ప్రతి ఒక్కరి ప్రత్యేక అవసరాలకు నిర్దిష్ట సూక్ష్మ ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. LDF, UDF పరిపాలనల కింద స్థానిక సంస్థల భాగస్వామ్యంతో, రాజకీయ సరిహద్దులను అధిగమించి సమన్వయంతో చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ విజయం అని మంత్రి ఎమ్బీ రాజేష్ తెలిపారు. 

Also Read: USA: అమెరికాలో భారత సంతతి వ్యక్తి బ్లాక్ రాక్ స్కామ్..500 మిలియన్ల టోకరా

Advertisment
తాజా కథనాలు