/rtv/media/media_files/2025/11/01/pakistan-2025-11-01-07-45-23.jpg)
చైనా, పాకిస్తాన్, భారత్ లను కలిపి ప్రవహించే నది సింధునది. పహల్గాం దాడి(Pahalgam Attack) తరువాత భారత్, పాకిస్తాన్(India vs Pakistan) మధ్య దౌత్య సంబంధాలు చెడిపోయాయి. ఈ కారణంగా భారత్..పాక్ కు సింధు జలాల ను ఆపేసింది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని మోదీ ప్రకటంచారు. యుద్ధం ఆపేసినా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించింది. ఉగ్రవాదం పూర్తిగా సమసిపోయే వరకు పాక్ ను కట్టడి చేసే ఉద్దేశంతో సింధుజలాలను నిలిపేసింది.
నీటికొరతతో అవస్థలు..
అయితే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్‌లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అప్పటి నుంచి పాకిస్తాన్ నీరు లేక నానా అవస్థలు పడుతోంది. సింధు జలాల ఆగిపోయిన తరువాత నుంచి పాకిస్తాన్ పరిస్థితి ఏమీ బాగాలేదని చెబుతోంది సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ . 80 శాతం పాకిస్తాన్ వ్యవసాయం సింధు పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ నీరు ఆగిపోవడంతో పంటలు పండే అవకాశమే లేకుండా పోయింది. ఇది పాకిస్తాన్ కు చాలా పెద్ద దెబ్బ అవుతూందని అని చెబుతోంది ఐపిఈ నివేదిక.
పాకిస్తాన్ రైతులు ఇప్పటికే వాతావరణం పరంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకదాని తరువాత ఒకటి వరదలు, కరువులతో అల్లల్లాడుతున్నారు. పాకిస్తాన్ దగ్గర తగినంత ఆనకట్టల నిల్వ లేకపోవడంతో రైతులకు తగినంత నీరు అందడం లేదు. దానికి తోడు ఆఫ్ఘనిస్థాన్ కూడా కునార్ నదిపై డ్యామ్ ను నిర్మించాలని చూస్తోంది. ఇది కనుక జరిగితే పాకిస్తాన్ కు నలువైపులా దిగ్భంధన తప్పదు అని చెబుతోంది ఐపీఈ నివేదిక. భారత్ తన ఆనకట్టలను మూసేయడంతో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని చీనాబ్‌లోని కొన్ని ప్రాంతాలు కొన్ని రోజుల పాటు ఎండిపోయాయి. మరోవైపు భారత్ రావి, సట్లెజ్ నదుల నీటిని కూడా పాకిస్తాన్ కు అందకుండా చేస్తోంది. వాటిల్లో నీటిని పూర్తిగా ఉపయోగించుకున్నాకనే పాకిస్తాన్ కు ఇస్తోంది. ఆ నీరు వారికి సరిపోవడం లేదని నివేదిక చెబుతోంది.
Also Read: Afghan-Pakistan: ఆఫ్ఘాన్ నిర్మిస్తున్న డ్యామ్ కు భారత్ మద్దతు..పాక్ కు డబుల్ షాక్
Follow Us