ISRO: ఈ రోజే ఎల్ఎం3-ఎం5  రాకెట్ ప్రయోగం

ఇస్రో ఈ రోజు మరో కొత్త ప్రయోగం చేపట్టడానికి సిద్ధమైంది. షార్ లో ఈరోజు సాయంత్రం 5.26 గంటలకు ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా సీఎంఎస్‌-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు.

New Update
isro

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో  మరో రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిస్తోంది. దీని కౌంట్ డౌన్ ను నిన్న 24 గంటలకు ముందు ప్రారంభించింది. ఈరోజు సాయంత్రం 5.26 గంటలకు సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ను ప్రయోగించనున్నారు. రాకెట్‌కు హైడ్రోజన్, హీలియం నింపే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఈ ప్రయోగం ద్వారా సీఎంఎస్‌-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడడంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. షార్ లోని రెండో వేదిక నుంచి రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళనుంది. కౌంట్ డౌన్ కార్యక్రమం మొత్తాన్ని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ దగ్గరుండి పరిశీలించారు. 

తిరుమల దర్శనం..

మరోవైపు ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛౌర్మన్ నారాయణన్, షార్‌ డైరెక్టర్‌ వి.ఎస్‌.పద్మకుమార్, పలువురు శాస్త్రవేత్తలు నిన్న తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. దాని తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని.. 4,410 కిలోల బరువున్న సీఎంఎస్‌-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీవో)లోకి ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు