JD Vance: జేడీ వాన్స్, ఉషా చిలుకూరితో విడాకులు? వెంటనే ఎరికా కిర్క్ తో పెళ్ళి?

యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. అంతేకాదు వెంటనే ఆయన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ ను పెళ్ళి కూడా చేసుకుంటారని రచయిత్రి షాన్ వాట్స్ జోస్యం చెప్పారు. 

New Update
JD

గత రెండు రోజులుగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేరు తెగ వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం ఒక యూనివర్శిటీలో ఇండియన్ అమ్మాయి ఆనను నిలదీయం, దానితో పాటూ వాన్స్ క్రీస్టియన్ మతం గురించి మాట్లాడడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు తాజాగా మరోసారి జీడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ విడాకులు తీసుకుంటారనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. 

విడాకులు...ఆ వెంటనే పెళ్ళి..

ఈ వార్తల వెనుక ప్రముఖ రచయిత్రి షానన్ ఉన్నారని చెబుతున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం మిసిసిపీ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో జేడీ వాన్స్, ఎరికా కిర్క్ ను కలిశారు. అక్కడ ఆయన ఆమెను కౌగలిగించుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ వెంటనే రచయిత్రి షానన్ వీరిద్దరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. జేడీ వాన్స్ ఆయన భార్య ఉషాకు విడాకులు ఇస్తారని..వెంటనే ఎరికా కిర్క్ ను పెళ్ళి చేసుకుంటారని చెప్పారు. షానన్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి. అందుకే ఆమె మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. జేడీ వాన్స్, ఎరికా కిర్క్ ఆలింగనం చేసుకున్న ఫోటోకు బదులిస్తూ.. ఎక్స్ వేదికగా వీరిద్దరూ వచ్చే ఏడాది చివరి నాటికి పెళ్లి చేసుకుంటారని చెప్పారు.  ఈ ట్వీట్ నిమిషాల్లో వైరల్ అయింది.ఏకంగా ఈ పోస్టుకు 8.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇదే సమయంలో జేడీ వాన్స్ తన భార్య మతం, ఆమె క్రిస్టియానిటీలోకి మారుతుంది అని చెప్పారు. వాన్స్ 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో MAGA అభ్యర్థిగా నిలబడాలని ఆశిస్తున్న నేపథ్యంలో.. ఉషా హిందువుగా ఉండటం రాజకీయంగా అడ్డంకి కావచ్చని కొందరు విశ్లేషకులు చెప్పడం అన్నీ షానన్ మాటలకు ఊతమిచ్చాయి. దీంతో వాన్ కచ్చితంగా విడాకులు తీసుకుంటారని మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ పుకార్లపై జేడీ వాన్స్ స్పందించారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేశారు.  తన భార్య ఉషాకు మతం మారే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉషాను పొగుడుతూ.. ఆమె తన జీవితంలో దొరికిన అద్భుతమైన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. మతం మారడం తన ఇష్టమని...దానికి నేను విలువనిస్తానని చెప్పడంతో ఈ రూమర్లకు చెక్ పెట్టినట్టయింది. 

Also Read: ISRO: ఈ రోజే ఎల్ఎం3-ఎం5  రాకెట్ ప్రయోగం

Advertisment
తాజా కథనాలు