Tanzania: టాంజానియా ఎన్నికల్లో రక్తపాతం..700 మంది మృతి

టాంజానియాలో ఎన్నికలు రక్తపాతానికి దారి తీశాయి. అధ్యక్షురాలు సామియా సులుహు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రజలు ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు , నిరసనకారులకు జరిగిన గొడవల్లో 700 మంది ప్రాణాలు మృతి చెందారని తెలుస్తోంది.

New Update
tanzania

టాంజానియాలో ఎన్నికలు రక్తపాతానికి దారి తీశాయి. అధ్యక్షురాలు సామియా సులుహు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రజలు ఆందోళనలు చేశారు. వాటిని అడ్డుకునే క్రమంలో భద్రతా బలగాలు చేసిన ప్రయత్నాలు హింసాత్మకంగా మారాయి. రాజధాని దార్ ఎస్ సలామ్ లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత మూడు రోజులుగా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 700 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. 

వేల మంది ప్రజలు రోడ్లపైకి..

అధ్యక్షురాలు సామియా ప్రత్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీని ఫలితంగా అధికార CCM పార్టీపై ఎన్నికల మోసం ఆరోపణలు వచ్చాయి. దీనికి నిరసనగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి అల్లర్లు చేశారు. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ మరియు లైవ్ గన్‌లను ప్రయోగించారు. మరోవైపు నిరసకారులు వాహనాలు, పోలీస్ స్టేషన్లు, గ్యాస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే వందల మంది ప్రాణాలు పోయాయి. దీని తరువాత టాంజానియాలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ ఆపేశారు. వీటితో పాటూ దాదాపు అన్ని చోట్లా సైన్యాన్ని మోహరించారు. 

Advertisment
తాజా కథనాలు