USA: నెల రోజులుగా షట్ డౌన్..రూ.62 వేలకోట్లకు పైగా అమెరికా సంపద ఆవిరి

గత నెల రోజులుగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతోంది. దీని కారణంగా అక్కడి కార్యకలాపాలు అన్నీ ఆగిపోయాయి. దీని కారణంగా దాదాపు రూ.62 వేల కోట్లకు పైగా సంపద ఆవిరి అయిందని అధికారులు చెబుతున్నారు. 

New Update
White House clarifies

నెల రోజుల క్రితం అమెరికా సెనేట్ లో నిధుల బిల్లులపై రిపబ్లికన్, డెమోక్రాట్ సెనేట్లు ఒక అంగీకారానికి రాకపోవడంతో ప్రభుత్వాన్ని మూసివేసే పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఏడేళ్ళ తర్వాత మొదటిసారిగా ఇది జరిగింది.  రిపబ్లికన్ల తరుఫు నుంచి 55 ఓట్లువచ్చినప్పటికీ అవి సరిపోలేదు. ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే  కనీసం 60 ఓట్లు రావాలి. దీంతో బిల్లులు వీగిపోయాయి. అలాగే డెమొక్రాట్లు ప్రతిపాదించిన మరో బిల్లు కూడా 47-53 తేడాతో ఓడిపోయింది. సాధారణ ప్రజల బీమా ప్రీమియంలు పెరగకుండా ఉండేందుకు ACA పన్ను క్రెడిట్‌ల గడువును పొడిగించాలని డెమొక్రాట్లు పట్టుబట్టారు. రిపబ్లికన్లు చేసిన మెడికేయిడ్ కోతలను కూడా వెనక్కి తీసుకోవాలన్నారు. ఈవిషయంలో ఇరువర్గాలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో అమెరికా బడ్జెట్ క్లోజ్ అయింది. 

దారుణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ..

ఇప్పుడు ఈ సుదీర్ఘ షట్ డౌన్ కారణంగా అమెరికా భారీ నష్టాలను చవి చూస్తోంది. తాజాగా కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీఓ) విడుదల చేసిన అంచనాల ప్రకారం..అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి 7 బిలియన్ డాలర్లు అంటే రూ.62,149 కోట్ల సంపద శాశ్వతంగా కనుమరుగైపోయింది. ఈ షట్‌డౌన్ గనుక ఇలాగే కొనసాగితే.. 6 వారాలకు 11 బిలియన్ డాలర్లు.. 8 వారాలకు 14 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం ఏర్పడుతుందని సీబీఓ హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ షట్ డౌన్ కారణంగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు.. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ప్రతివారం అమెరికా ఆర్థిక వృద్ధిలో 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది యూఎస్ మార్కెట్లకు అంతరాయం కలిగించవచ్చని చెబుతున్నారు.  ఇప్పటికే అమెరికాలో జాబ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. దానికి తోడు షట్ డౌన్ కారణంగా ప్రభుత్వ సంస్థలను మూసివేయడం..ఉద్యోగాల కొరతను మరింత పెంచుతుందని అంచనా వేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు