/rtv/media/media_files/2025/11/01/bamkim-2025-11-01-09-59-02.jpg)
అమెరికాలో పెద్దగా ఎవరికీ తెలియని టెలీకాం పర్వీసెస్ బ్రిడ్జివాయిస్, బ్రాడ్ బాండ్ టెలీకాం కంపెనీలకు సీఈవో బంకిమ్ బ్రహ్మభట్. భారత సంతతికి చెందిన ఈ వ్యక్తి ఇప్పుడు మనీ ఫ్రాడ్ కేసులో ఇరుకున్నారు. అమెరికన్ రుణదాతల నుండి పెద్ద మొత్తంలో రుణాలు పొందడానికి నకిలీ కస్టమర్ ఖాతాలు , రాబడులను సృష్టించాడని బంకిమ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇతనికి రుణాలు ఇచ్చిన వారిలో యూఎస్ లో అతి పెద్ద ఇన్వెస్ట్ మెంట్ సంస్థలైన బ్లాక్ రాక్, హెచ్ పీఎస్ కూడా ఉన్నాయి. తిరిగి రాబట్టు కోలేని ఆస్తులను ఆదాయ మార్గాలుగా చూపించి బంకిమ్ అప్పులు తీసుకుని తమను తప్పుదోవ పట్టించారని చెబుతున్నారు. ఇప్పుడు అతని కంపెనీలు దివాలా తీశాయని..దాంతో తమకు 500 మిలియన్ డాలర్లకు పైగా బాకీ పడ్డారని తెలిపాయి.
ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్ లో మోసాలు..
HPS మొదట సెప్టెంబర్ 2020లో తన సంస్థల్లో ఒకదానికి డబ్బును అప్పుగా ఇచ్చింది. తరువాత క్రమంగా దాని ఎక్స్‌పోజర్‌ను పెంచింది . 2021 ప్రారంభంలో USD 385 మిలియన్లకు, ఆగస్టు 2024 నాటికి USD 430 మిలియన్లకు BNP పారిబా ఈ రుణాలలో దాదాపు సగం నిధులను అందించిందని.. రెండు HPS క్రెడిట్ ఫండ్‌ల మధ్య విభజించబడిందని వర్గాలు WSJకి తెలిపాయి. ఈ వివాదం ప్రస్తుతం అమెరికా మార్కెట్ లో కలకలం రేపుతోంది.ఇంత పెద్ద ఫ్రాడ్ బయటపడడంతో వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్ లో ఈ తరహా మోసాలు ఎక్కువ అవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పరారీలో బంకిమ్?
బంకిమ్ బ్రహ్మభట్ ప్రస్తుతం పరారీలో కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గార్డెన్ సిటీలో అతని ఆఫీసు తాళం వేసి ఉందని అంటున్నారు. ఇంటి దగ్గరకు వెళ్ళగా అక్కడ కూడా ఎవరూ లేరని చెబుతున్నారు. దీంతో బ్రహ్మభట్ అమెరికా వదిలి ఇండియా వెళ్ళిపోయారని అంటున్నారు. అయితే అతని లాయర్లు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు ప్రైవేట్ రుణాలలో పెరుగుతున్న నష్టాలపై ఎత్తి చూపించింది. ఇక్కడ పెట్టుబడిదారులు అధిక-దిగుబడి ఒప్పందాలకు నిధులు సమకూర్చుకోవడానికి పోటీ పడుతున్నారు. కానీ అప్పు తీసుకున్న తర్వాత మాత్రం దానిని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రం లెక్కలు చూపించడం లేదు. తీసుకున్న అప్పును కూడా తిరిగి ఇవ్వడం లేదని చెబుతున్నారు.
Also Read:Pakistan: నీటికొరతతో పాకిస్తాన్ పాట్లు..సింధునది జలాలు లేక తీవ్ర నష్టం
Follow Us