Afghan-Pakistan: ఆఫ్ఘాన్ నిర్మిస్తున్న డ్యామ్ కు భారత్ మద్దతు..పాక్ కు డబుల్ షాక్

పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేందుకు భారత్ దారిలోనే ఆఫ్ఘాన్ కూడా నడుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే కునార్ నదిపై డ్యామ్ ను నిర్మించాలని భావిస్తోంది. దీనికి భారత్ మద్దతు తెలిపింది. 

New Update
kunar

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేందుకు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ నది పాకిస్తాన్ కు అత్యంత కీలకం. పాక్ వ్యవసాయం అంతా సింధు నదీ, దాని ఉప నదుల జలాలపైనే అధారపడి ఉంటుంది. అందుకే సింధు జలాలను ఆపేసింది భారత్. ఇది పాకిస్తాన్ కు పెద్ద దెబ్బ అయింది. ఇప్పడు ఆఫ్ఘాన్ కూడా భారత్ నే అనుసరిస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే నదులను నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. రెండు దేశాలకు ప్రవహించే కునార్ నదిపై డ్యామ్ ను నిర్మించేందుకు రెడీ అయింది. కునార్ నది కాబూల్ నదితో కలిసిన తర్వాత పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తుంది. దీనిని పాకిస్తాన్ లో చిత్రాల్ నదిగా పిలుస్తారు. ఆ తర్వాత ఇది సింధూ నదిలో కలిసి, అరేబియా సముద్రంలో కలుస్తుంది.

ఆఫ్గాన్ కు మద్దతుగా భారత్..

రీసెంట్ గా కునార్ నదిపై డ్యామ్ నిర్మించాలంటూ తాలిబాన్ అధినేత హిబతుల్లా అఖుంద్‌జాదా ఆదేశాలు జారీ చేశారు. వీలైనత తొందరగా ఆనకట్ట  నిర్మించాలని ఆదేశించారు. విదేశీ కంపెనీల కోసం వేచి చూడకుండా, ప్రాజెక్టును ప్రారంభించడానికి దేశీయ కంపెనీలో ఒప్పందాలు చేసుకోవాలని మంత్రి  ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. ఈ నిర్యానికి భారత్ మద్దతు తెలిపింది.  డ్యామ్ నిర్మాణ విషయంలో ఆఫ్ఘానిస్తాన్‌కు భారత్ సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జలవిద్యుత్ ప్రాజెక్టులతో సహా స్థిరమైన నీటి నిర్వహణ కోసం ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న అన్ని ప్రయత్నాలకు భారతదేశం అండగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. డ్యామ్ ల నిర్మాణం విషయంలో ఇప్పటికే భారత్ ఆఫ్ఘనిస్తాన కు చాలాసర్లు సహాయం చేసింది. ఆ దేశంలో పలు డ్యామ్ లను నిర్మించింది. హెరాత్ ప్రావిన్సులో సల్మా ఆనకట్టను నిర్మించింది. 

Also Read: US-India: భారత్, అమెరికాల మధ్య రక్షణ ఒప్పందం..10 ఏళ్ళకు అంగీకారం

Advertisment
తాజా కథనాలు