Earthquake: లడఖ్ లో భూకంపం..భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

ఈ రోజు సాయంత్రం లడఖ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. లేహ్ లో కూడా భూకంపం వచ్చిందని తెలుస్తోంది. భయంతో జనాలు ఇళ్ళను నుంచి బయటకు పరుగులు తీశారు.

New Update
Earthquake

Earthquake

తజకిస్తాన్, పాకిస్తాన్ ల తర్వాత భూకంప ప్రకంపనలు ఇండియాకు కూడా వ్యాపించాయి. ఈ రోజు సాయంత్రం 5:42 గంటలకు లడఖ్ లో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 4.1 గా భూకంప తీవ్రత నమోదైంది.   అటువైపు లేహ్ లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడం ప్రారంభించిన వెంటనే, ఆ ప్రాంతం భయాందోళనలకు గురైంది. జనాలు ఇళ్ళను వదిలి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు