US-Pakistan: పాక్ నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల తరలింపు..గుట్టు చప్పుడు కాకుండా డీల్..
అమెరికా , పాకిస్తాన్ రహస్యంగా ఖనిజాలకు సంబంధించి వ్యూహాత్మక ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీంట్లో పాక్ తన దేశం నుంచి అరుదైన ఖనిజాలను అమెరికాకు పంపించనుంది.అందుకు బదులుగా అగ్రరాజ్యం పాక్ లో ఖనిజ శుద్ధి కేంద్రాల కోసం ఏకంగా రూ.4200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.