/rtv/media/media_files/2026/01/23/musk-2026-01-23-10-41-23.jpg)
టెక్ అధిపతి ఎలాన్ మస్క్ కు వాక్చాతుర్యం బానే ఉందని అంటారు. దీన్ని ఆయన మరొకసారి సిరూపించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దావోస్ లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నారు. అందులో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిసాధించిన బోర్డ్ ఆఫ్ పీస్ కూడా ఒకటి. దీనిపై మస్క్ సంచలన కామెంట్స్ చేశారు. ఇది బోర్డ్ ఆఫ్ పీస్ కాదని.. వెనెజువెలా, గ్రీన్‌లాండ్ లానే ఇది కూడా ఒక పీస్ అని సెటైర్లు వేశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన ఆ బోర్డు పేరులో ఉన్నది 'Peace' (శాంతి) అనుకోవాలా.. లేక అది 'Piece' (ముక్క) అనుకోవాలా? బహుశా అది గ్రీన్‌ల్యాండ్‌లో ఒక ముక్క లేదా వెనిజులాలో ఒక ముక్క కావాలని ఆయన కోరుకుంటున్నారేమో అంటూ ఎలాన్ వెటకారంగా మాట్లాడారు. దీంతో అక్కడంతా ఒక్కడంతా ఒక్కసారిగా నవ్వుల మోత మోగింది.
Elon Musk made fun of Donald Trump's newly announced "Board of Peace" at his appearance at the 2026 World Economic Forum.
— Subjective Views (@subjectiveviews) January 22, 2026
"I heard about the formation of the peace summit. And I was like, is that PIECE?" pic.twitter.com/KSZpkInKZE
అవకాశం దొరికినప్పుడల్లా..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవ్వడంలో, బాధ్యతలు చేపట్టాక కూడా టెక్ అధిపతి ఎలాన్ మస్క్ ఆయనకు అండగా ఉన్నారు. ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి కారణం కూడా మస్కే అని చెబుతారు. అలాగే ఆయన బాధ్యతలు చేపట్టాక...ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు కూడా చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు పెట్టిన డోజ్ ను కూడా ఎలాన్ నడిపించారు. అయితే కొన్ని నెలల తర్వాత ట్రంప్ గవర్నమెంట్ నుంచి మస్క్ తప్పుకున్నారు. అప్పటి నుంచి ఎలాన్ మస్క్ ఏ అవకాశం వచ్చినా ట్రంప్ పై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే చేశారు. గాజా శాంతి మండలిపై సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ట్రంప్, మస్క్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి..అయినా కూడా ఆయన విదేశీ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేశారు.
2027 నాటికి ఆప్టిమస్ రోబోలు..
దీంతో పాటూ ఎలాన్ మస్క్ మరిన్ని విషయాలపై మాట్లాడారు. భవిష్యత్తులో రోబోలు సమాజాన్ని పూర్తిగా మార్చేస్తాయని.. భూమిపై మనుషుల కంటే రోబోల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని మస్క్ అన్నారు. టెస్లా అభివృద్ధి చేస్తున్న ‘ఆప్టిమస్’ హ్యూమనాయిడ్ రోబోలను 2027 చివరి నాటికి ప్రజలకు విక్రయించడం ప్రారంభిస్తామని మస్క్ ప్రకటించారు. వృద్ధుల సంరక్షణ, పిల్లల పనుల కోసం ప్రతి ఒక్కరూ ఒక రోబోను కోరుకుంటారని మస్క్ తెలిపారు. 2026 పూర్తయ్యే నాటికి ఒక మనిషి కన్నా ఏఐ తెలివైనదిగా మారుతుందని, 2030 నాటికి మొత్తం మానవాళి మేధస్సు కంటే కృత్రిమ మేధస్సు మిన్నగా ఉంటుందని ఎలాన్ ఉద్ఘాటించారు.
Also Read: Putin: ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం రష్యా ఆస్తులు ఇచ్చేస్తా..పుతిన్
Follow Us