Russia-Ukraine war: ఈరోజు నుంచి ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రైపాక్షిక చర్చలు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా మరో అడుగు ముందుకు పడింది. రష్యా, ఉక్రెయిన్, అమెరికాలు ఈరోజు నుంచి రెండు రోజుల పాటూ త్రైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దీనికి వేదిక కానుంది.

New Update
war

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో కీలక పరిణామం జరిగింది. స్విట్జర్లాండ్ లో జరుగుతున్న దావోస్ లో రష్యా, ఉక్రెయిన్, అమెరికాలు మొదటిసారిగా త్రైపాక్షిక భేటీకి సిద్ధమయ్యాయి. యూఏఈ వేదికగా మూడు దేశాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నిన్న దావోస్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈరోజు, రేపు ఈ సమావేశాలు జరగనున్నాయి. తాము మాత్రమే కాదు.. రష్యన్లు కూడా రాజీకి సిద్ధంగా ఉండాలని జెలెన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశాలు తమకు చాలా ముఖ్యమని చెప్పారు.

వెంటనే యుద్ధాన్ని ముగించాలి..

అంతకుముందు దావోస్‌ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ , జెలెన్‌స్కీలు భేటీ అయ్యారు. తమ మధ్య సమావేశం బాగా జరిగిందని..ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని ట్రంప్ అన్నారు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. గత నెలలో 30 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చాలావరకు సైనికులే ఉన్నారు. యుద్ధం ముగించకపోతే మనందరికీ అవమానమే అని వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడి ప్రారంభించిన తర్వాత.. అమెరికా మధ్యవర్తిత్వంలో ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు నేరుగా ఒకే వేదికపై చర్చలు జరపడం ఇదే మొదటిసారి. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఈ సమావేశంపై ఆసక్తిగా ఉన్నారు. ఈ సమావేశం సాంకేతిక స్థాయిలో జరుగుతుంది. అంటే ఇరు దేశాల ఉన్నతాధికారులు యుద్ధ విరమణకు సంబంధించిన ముసాయిదా పత్రాలు, సాంకేతిక అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా తక్షణమే కాల్పుల విరమణ, యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ కు అమెరికా అందించే భద్రత అంశాలపై చర్చించనున్నారు. 

Also Read: BCB: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్..రీప్లేస్ వీలు కాదని తేల్చి చెప్పిన ఐసీసీ

Advertisment
తాజా కథనాలు