/rtv/media/media_files/2026/01/23/bcb-2026-01-23-07-53-19.jpg)
భారత్, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ, దౌత్య పరమైన ఉద్రిక్తతలు క్రికెట్ మీద కూడా ప్రభావం చూపించాయి. వచ్చే నెల 9 నుంచి మొదలు కానున్న టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్ లో తమకు భద్రత లేదని...అందుకే వరల్డ్‌కప్‌లో ఆడే తమ మ్యాచ్‌లను భారత్‌లో కాకుండా శ్రీలంకలో నిర్వహించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు బంగ్లాదేశ్ విజ్ఞఫ్తి చేయగా.. దానికి ఐసీసీ అంగీకరించలేదు. బంగ్లాదేశ్ గ్రూప్ ను మార్చాలన్న విజ్ఒప్తినీ తోసి పుచ్చింది. దాంతో బీసీబీ టీ20 ప్రపంచ కప్ లో ఇక ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువు కూడా అక్కర్లేదని తేల్చి చెప్పింది.
భద్రతాపరమైన సమస్యలు లేవు..
నిన్న అన్ని ఫుల్ మెంబర్ స్క్వాడ్ దేశాలతో..ఐసీసీ బోర్డు సమావేశం అయింది. ఇందులో ఓటింగ్ నిర్వహించి మరీ కీలక నిర్ణయం తీసుకుంది. దాని తరువాత 20 జట్లతో జరిగే టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని, బంగ్లాదేశ్ తప్పనిసరిగా భారత్‌కు వచ్చి ఆడాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. భారత్ లో ఎలాంటి భద్రతాపరమైన ముప్పూ లేదని...తమకు తాము ఏదో అనుకుని మ్యాచ్ లను శ్రీలంకకు మార్చమనడం సమంజసం కాదని ఐసీసీ అంది. అందుకే మ్యాచ్ ల వేదిక మార్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. బంగ్లా బోర్డ్ కు ఒక్క రోజు గడువు ఇస్తున్నామని ఏదో ఒకటి తేల్చుకోవాలని అల్టిమేటం ఇచ్చింది.
ఐసీసీ నిర్ణయంపై బీసీబీ అసహనం వ్యక్తం చేసింది. బంగ్లా క్రికెటర్లు ప్రపంచకప్ కోసం ఎంతో కష్టపడ్డారని.. కానీ భారత్‌లో భద్రతాపరమైన ఆందోళనలు అలాగే ఉన్నాయని క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అన్నారు. తమను కాదని ఐసీసీ ముందుకు వెళ్తే అది వారి వైఫల్యమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇదెలా ఉంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఆడడం తిరస్కరించడంతో దాని స్థానంలో స్కాట్ లాండ్ జట్టును ఆడించే అవకాశాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో భాగంగా బంగ్లాదేశ్ జట్టు 3 మ్యాచ్‌లను కోల్‌కతాలో, ఒక మ్యాచ్‌ను ముంబైలో ఆడాల్సి ఉంది. బంగ్లా స్థానంలో స్కాట్ లాండ్ ఈ మ్యాచ్ లను ఆడుతుంది.
Follow Us