/rtv/media/media_files/2026/01/22/eu-vs-trump-2026-01-22-11-59-59.jpg)
మిత్రదేశాలే ఇప్పుడు కొట్టుకుంటున్నాయి. ఒక ద్వీపం కోసం నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవలు పడుతున్నాయి. అమెరికా మొదలుపెట్టిన ఈ యుద్ధాన్ని ఐరోపా దూశాలు కంటిన్యూ చేస్తున్నాయి. వెనెజెవెలా తర్వాత అమెరికా అధ్యక్షుడు గ్రీన్ ల్యాండ్ మీద ఫోకస్ చేశారు. సహజ వనరులతో నిండి ఉన్న దాన్ని ఎలా అయినా సొంతంత చేసుకుంటానని చెప్పారు. కానీ దీనికి డెన్మాక్క్ తో సహా ఐరోపా దేశాలన్నీ ఒప్పుకోలేదు. గ్రీన్ ల్యాండ్ తమ భూభాగమని డెన్మార్క్ వాదిస్తోంది. దానికి ఐరోపా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. మరింకో వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఊరుకున్నారా...అబ్బే మీకే అంత ఉంటే నాకెంత ఉండాలి అంటూ...తనకు మద్దతు ఇవ్వని ఐరోపా దేశాల మీద సుంకాల మోత మోగించారు. మొదట 10 శాతంతో విరుచుకుపడ్డారు. దాన్ని ఇంకా పెంచుతానని కూడా హెచ్చరించారు. దీంతో ఈయూకు మండింది.
దావోస్ సాక్షిగా ఈయూ మండిపాటు..
ఇదిలా జరుగుతుండగా...ప్రతీ ఏటా జరిగే ఎకానిమిక్ ఫోరమ్ దావోస్ టైమ్ వచ్చింది. ప్రపంచదేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ఈయూ దేశాల నేతలు, అమెరికా అధ్యక్షుడు అందరూ వచ్చారు. ఇదే సరైన సమయం అనుకున్నాయి ఐరోపా దేశాధినేతలు . ట్రంప్ మీద ఉన్న కోపాన్ని అంతా చూపించేశారు. అమెరికా ఆధిపత్యం కారణంగా ప్రపంచం విచ్ఛిన్నం అవుతోందని, ఇక ఆ దేశంతో కలిసి నడిచే రోజులు పోయాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. శక్తివంతమైన దేశాలు ఏం కావాలంటే అది చేస్తున్నాయి. బలహీనమైన దేశాలు నష్టపోతున్నాయి. ఈ పద్ధతి ఇక మీదట కొనసాగదు అని కార్నీ అన్నారు. తామ స్వతంత్ర దేశంగా నిలబడతామని బల్లగుద్ది మరీ చెప్పారు. గ్రీన్ లాండ్, డెన్మార్క్ కు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని, గ్రీన్ లాండ్ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఆ ప్రాంతానికి మాత్రమే ఉందని కార్నీ ఉద్ఘాటించారు.
సామ్రాజ్యవాదం రుద్దుతున్నారు..
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సైతం ట్రంప్ పై విరుచుకుపడ్డారు. అమెరికా కొత్త వలసవాద సామ్రాజ్య విధానాన్ని అనుసరిస్తోందని, దీనివల్ల దశాబ్దాల నాటి భాగస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రన్ హెచ్చరించారు. మనం బెదిరిర చేవాళ్లకు, క్రూరమైన చట్టాలకే గౌరవం ఇస్తున్నామంటూ ప్రస్తుత యూరప్ విధానాలను తూర్పారబట్టారు.సుంకాల ద్వారా ఐరోపాను అణిచివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ట్రేడ్ బజూకాకు సిద్ధం కావాలని ఆయన ఐరోపా కూటమికి పిలుపునిచ్చారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మెక్రాన్...ట్రంప్ పై విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ చట్టం బలవంతుల అదుపు ఆజ్ఞల్లో పడి కొట్టుకుపోతోందని ఆరోపించారు. సామ్రాజ్య వాదం మళ్లీ పురుడుపోసుకుంటోంది. ట్రంప్ విధిస్తున్న అంతులేని సుంకాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మెక్రాన్ అన్నారు. మేము బెదిరించే వారికంటే గౌరవానికి ప్రాధాన్యమిస్తామని మేక్రాన్ నొక్కి చెప్పారు.
ఏం చేసుకుంటారో చేసుకోండి..
వీరిద్దరితో పాటూ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఆ దేశ ఎంపీ ఎడ్ డేవీ, జర్మనీ ఆర్థిక మంత్రి లార్స్ క్లింగ్‌బీల్, డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రధానులు మెట్టీ ఫ్రెడరిక్‌సెన్, జెన్స్ ఫ్రెడరిక్ నీల్సెన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ తదితరులు కూడా ట్రంప్ విధానాలను తీవ్రంగా ఖండించారు.మిత్రదేశాలపై ట్రంప్ సుంకా లు విధించటం సరికాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మన్ అన్నారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ ప్రకటన అంతర్జాతీయ చట్టాలను ప్రమాదంలో పడేసిందని గ్రీన్‌లాండ్ ప్రధా ని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సెన్ విమర్శించారు.ట్రంప్ అయినా అంత కంటే శక్తివంతుల వచ్చినా తమను ఎవరూ విడదీయలేరంటూ గ్రీన్ ల్యాండ్ కు సంఘీభావంగా నిలిచారు. 10 శాతం కాదు కదా 100 శాతం సుంకాలు విధించినా ఎదిరిస్తామని ఢంకా భజాయించారు. దానికి తోడు యూరప్ దేశాలపై ఆయన సంధించిన టారిఫ్స్ అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు ఈయూ కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ తో ట్రేడ్ డీల్‌కు ఆమోదం తెలపకుండా ఈయూ పార్లమెంట్ ఫ్రీజ్ చేసింది. డీల్‌లో భాగంగా రానున్న రోజుల్లో అమెరికా వస్తువులపై టారిఫ్స్ ఎత్తేసేందుకు ఓటింగ్ జరపాల్సి ఉంది. కానీ ట్రేడ్ డీల్ నిలిపివేయడంతో ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు.
మొత్తానికి గ్రీన్ ల్యాండ్ విషయంలో అమెరికా, ఈయూ సై అంటే సై అనుకుంటున్నాయి. ఐరోపా దేశాలు ఊకుమ్మడిగా దండెత్తడంతో సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కు తగ్గారు. వాటిని ఉపసంహరించుకున్నారు. కానీ గ్రీన్ ల్యాండ్ మాదే అంటూ మరో సారి ప్రకటించారు. అలాగే ఈయూ కూడా తగ్గేదే ల్యా అంటోంది. ట్రంప్ తమను ఏమీ చేయలేని పరిస్థితి తీసుకురావాలని డిసైడ్ అయింది. దీంతో ఈ యుద్ధం ఇక్కడితో ఆగేది కాదని స్పష్టం అయింది. ఈ ద్వీపం కోసం ఎంతకైనా వెళతారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీంతో ఇది ఎక్కడకు వెళుతుంది? ఏం జరగుతుంది అంటూ మిగతా ప్రపంచం అంతా ఆందోళనతో చూస్తోంది.
Follow Us