USA-Iran: ఇరాన్ పై అమెరికా యూటర్న్ తీసుకుందా? యుద్ధానికి రెడీ అవుతోందా?

ఇరాన్ తో యుద్ధం చేయమని చెప్పిన అమెరికా యూటర్న్ తీసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ కు దగ్గరగా అమెరికా నావికాదళం అతిపెద్ద నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ వచ్చింది. దానికి తోడు ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి సిద్ధమౌతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

New Update
trump vs khamenie

ఇరాన్, అమెరికాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్యా మాటల యుద్ధం జరుగుతోంది. ఇరాన్ చర్చలకు ఆసక్తి చూపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటుంటే..మా వేళ్ళు ఇంకా ట్రిగ్గర్ మీదనే ఉన్నాయని ఇరాన్ అంటోంది. ఈ నే పథ్యంలో అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ కు దగ్గరగా వస్తున్నాయి. అత్యంత విధ్యంసకర యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్...ఇరాన్ సముద్రంలో ఉంది. ఇది మొత్తం ఇరానియన్ సైన్యాన్ని ఒంటరిగానే నాశనం చేయగల శక్తి కలిగిందని చెబుతున్నారు. దీంతో పాటూ గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, జలాంతర్గాములు, ఇతర నౌకలతో కూడిన స్ట్రైక్ గ్రూప్ ఉందని తెలుస్తోంది. యుద్ధం జరిగితే, భూమి, సముద్రం లేదా ఆకాశం నుండి ఎక్కడి నుండైనా శత్రువుపై USS అబ్రహం లింకన్ విధ్వంసకర దాడిని ప్రారంభించగలదు. దీన్ని చూసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ను మ్యాప్ నుంచి తుడిచివేస్తానని అంతకు బెదిరించారు. 

ట్రంప్ సైతం యుద్ధం గురించి..

దీనికి తోడు అమెరికా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అధ్యక్షుడు మాట్లాడిన మాటలు కూడా ఇరాన్ పై యుద్ధాన్ని ప్రేరేపించేవిగా  ఉన్నాయి. ఇరాన్ వైపు అమెరికా సైనిక దళం కదులుతోందని ఆయన అందులో అన్నారు. విలేకరులతో మాట్లాడిన రికార్డింగ్ లో ఇరాన్ వైపు కదులుతున్న "పెద్ద ఫ్లోటిల్లా", "ఆర్మడా" "భారీ శక్తి" గురించి మాట్లాడటం స్పష్టంగా వినిపిస్తోంది. అయితే ఆయన ఇరాన్ పై దాడి గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహక నౌక దాడి బృందం మధ్యప్రాచ్యానికి చేరుకోనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు వెలువడ్డాని రాయిటర్స్ చెప్పింది. అయితే ప్రస్తుతానికి తమ సైన్యాన్ని మాత్రమే అక్కడకు పంపిస్తున్నామని..వాషింగట్న్ నిశితంగా పరిశీలిస్తోందని...ఇరాన్ చర్యల బట్టి పరిస్థితి మారవచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి సిద్ధం అవుతోందని తెలుస్తోంది.  అయితే అమెరికా తన నిర్ణయాన్ని ఆ దేశానికి ఇంకా చెప్పలేదని...త్వరలోనే చర్చిస్తారని అంటున్నారు. 

Also Read: Russia-Ukraine war: ఈరోజు నుంచి ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రైపాక్షిక చర్చలు

Advertisment
తాజా కథనాలు