Putin: ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం రష్యా ఆస్తులు ఇచ్చేస్తా..పుతిన్

ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. ఆ దేశ పునర్నిర్మాణానికి అమెరికా ఫ్రీజ్ చేసిన రష్యా ఆస్తులను విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒప్పందం కుదిరాకే అది జరుగుతుందని స్పష్టం చేశారు. 

New Update
Putin

Putin

ఈరోజు నుంచి రెండు రోజుల పాటూ అమెరికా, రష్యా, ఉక్రెయిన్ త్రైపాక్సిక చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా మూడు దేశాలూ చర్చించనున్నాయి. అయితే దీని కంటే ముందే రష్యా అధ్యక్షుడు చేసిన ఓ ప్రకటన అందరిలో ఆసక్తి కలిగించింది. పుతిన్ యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతం ఇచ్చారా అనే అనుమానం కలిగిస్తున్నాయి. 

సీజ్ అయిన మా ఆస్తులు ఇస్తాం..

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ గురించి ఓ సంచనల ప్రకటన చేశారు. అందులో  యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం రష్యా ఆస్తులను విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నిన్న రష్యా లో జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ట్రంప్ ప్రతిపాదించిన గాజా కాల్పుల విరమణ ప్రణాళికను పర్యవేక్షించే "బోర్డ్ ఆఫ్ పీస్" కోసం.. అమెరికా స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుండి 1 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తామని కూడా పుతిన్ ప్రకటించారు. అయితే రష్యా, ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందం కుదిరాకే వాటిని ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి అమెరికా ప్రతినిధులతో కూడా చర్చిస్తున్నామని చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి అమెరికా ప్రభుత్వం, ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను కూడా పుతిన్ ప్రశంసించారు.

అయితే త్రైపాక్షిక చర్చలు ఎంత వరకు సఫలం అవుతాయనేది మాత్రం తెలియడం లేదు. ఈ మీటింగ్ లో రష్యా తనపై లేదా తన వ్యాపార భాగస్వాములపై అమెరికా విధించే ఆంక్షలను నివారించే దిశగా చర్చలు చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు నాలుగేళ్ళుగా ఉక్రెయిన్ తో కొనసాగుతున్న యుద్ధం విషయంలో తన వైఖరిని పెద్దగా మార్చుకునేట్టు అయితే కనిపించడం లేదు. కానీ శాంతి స్థాపక కోసం మాత్రం తాము ప్రయత్నిస్తామని పుతిన్ పరోక్షంగా చెప్పారు. అందులో భాగంగానే ఉక్రెయిన్ పునర్నిర్మాణం గురించి మాట్లాడారని అంటున్నారు. అయితే, ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాల వల్ల ఈ ప్రక్రియ ఎంతవరకు విజయవంతమవుతుందో చెప్పడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.2025 ఫిబ్రవరి నాటికి..రాబోయే పదేళ్లలో ఉక్రెయిన్ పునర్నిర్మాణం, ఆర్థిక, సామాజిక మద్దతు కోసం మొత్తం ఖర్చు సుమారు 524 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 

Also Read: USA-Iran: ఇరాన్ పై అమెరికా యూటర్న్ తీసుకుందా? యుద్ధానికి రెడీ అవుతోందా?

Advertisment
తాజా కథనాలు