Cosmic Smile: జాబిల్లి నవ్వింది..నిన్న ఆకాశంలో అద్భుతం..త్రిగ్రహ సంయోగం..

జనవరి 23న నిన్న ఆకాశంలో అద్భుతం జరిగింది. ఆకాశంలో మూడు గ్రహాలు కనువిందు చేశాయి. చంద్రుడు, శని, నెప్ట్యూన్ కలిసి స్మైలీ ఆకారంలో ఒకే ప్రాంతంలో దగ్గరగా కనిపించారు.  దీనినే కాస్మిక్ స్మైల్ అంటారు.

New Update
cosmic smile

చంద్రుడు నవ్వితే(Cosmic Smile).. అది మనకు కనిపిస్తే..ఆ వూహే అద్భుతంగా ఉంది కదా. నిన్న రాత్రి ఆకాశం(sky) లో ఈ అద్బుత దృశ్యం ఆవిష్కృతం అయింది. సూర్యుడు చుట్టూ గ్రహాలు ఒక వలయాకారంలో తిరుగుతుంటాయని అందరికీ తెలిసిందే. అందులో భూమి మీద ఉండే మనకు చంద్రుడు తప్ప మిగతావేమీ కనిపించవు. ఎప్పుడో అరుదుగా మానవ కంటికి ఇతర గ్రహాలు కనిపిస్తాయి. అవి కూడా ఒక్కోటి ఒక్కోసారి. కానీ ఒకే సారి మూడు గ్రహాలు వరుసగా కనిపిస్తే...అది కూడా స్మైలీ ఆకారంలో.  అంత కంటే మంచి దృశ్యం ఏం ఉంటుంది. నిన్న రాత్రి ఇదే అందరికీ కనవిందు చేసింది.  చంద్రుడు, శని(శాటర్న్‌)(saturn), వరుడు(నెప్ట్యూన్‌) ఒకే ప్రాంతంలో దగ్గరగా కనిపించాయి. ఈ త్రిగ్రహ సంయోగం ఒక మధురానుభూతిని అందించింది. దీనినే కాస్మిక్ స్మైల్ అంటారని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 

Also Read :  అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను..   23 కోట్ల మంది బిక్కుబిక్కుమంటూ

చిరునవ్వు నవ్విన చంద్రుడు..

చంద్రుడు(moon) తన అర్థ ఆకారం పెరిగే క్రమంలో ఉండడం వల్ల ఉండటం వల్ల.. ఈ త్రిగ్రహ సంయోగం ఆకాశంలో చిరునవ్వు లాంటి ఆకారాన్ని సృష్టించనుంది. అంటే ఎప్పుడూ కనిపించే దాని కంటే చంద్రుడు పెద్దగా చిరునవ్వు షేప్ లో కనిపిస్తాడు. దానికి ఇరువైపులా రెండు కళ్ళల్లా శని, వరుణ గ్రహాలు చెరో పక్క కనిపించాయి. అయితే ఇలా ఏర్పడడానికి కారణం ఉంది. ఖగోళ శాస్త్రంలో కాంజంక్షన్‌ అనేది సాధారణమైన విషయం. రెండు లేదంటే అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రేఖాంశంలో.. అదీ దగ్గరగా కనిపించే సంఘటన. ఇది చాలా అరుదుగా జరుగుతుంది.  ఈసారి చంద్రుడు శని కంటే కొన్ని డిగ్రీల ఉత్తరంగా వంగడం.. అదే ప్రాంతంలో నెప్ట్యూన్‌ కూడా కనిపించడం వల్ల ఈ అరుదైన సంయోగం ఏర్పడింది. 

ఈ అపురూప దృశ్యం భారత్ తో సహా అన్ని దేశాల్లోనూ కనిపించింది. ఇప్పటికే భారత్ లో రాత్రి అయిపోయింది కాబట్టి వారికి ఇది కనిపించింది. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో పశ్చిమం వైపు ఈ దృశ్యం అత్యంత స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం ఖగోళ శాస్త్రజ్ఞులకే కాకుండా.. ఫోటోగ్రాఫర్లకు, ఖగోళ ప్రేమికులందరికీ ఒక మధుర క్షణాన్ని మిగుల్చింది అయితే చంద్రుడు, శని క్లియర్ గా కనిపించారు. నెప్ట్యూన్ కాస్త మసగ్గా ఉండడం వలన దానిని మాత్రం టెలీస్కోప్ లో చూడాల్సి వచ్చింది.  ఈ కాస్మిక్ స్మైల్ ఇంతకు ముందు కూడా ఏర్పడింది. కిందటి ఏడాది జూన్ 19న కూడా ఇలాంటి అరుదైన సంయోగం ఏర్పడి.. ఆకాశంలో “స్మైలీ ఫేస్” లాంటి దృశ్యం కనిపించింది. 

Also Read :  హమాస్ను అంతం చేసే దమ్ము ట్రంప్కు ఉందా? ఆ సంస్థ బలం ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు