AP BREAKING: ఏపీలో రైలు ప్రమాదం
రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని గమనించి వెంటనే రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు.
రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని గమనించి వెంటనే రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు.
టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసనకు దిగారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.
మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు.ఈ క్రమంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ వారీగా డబ్బుల్ని విడుదల చేస్తామన్నారు.
తిరుమలలో బోర్డు సభ్యుడు నరేష్కుమార్ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. మహాద్వారం నుంచి వెళ్లడానికి లేదని చెప్పిన ఉద్యోగి బాలాజీని దూషించారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్ బయటకు పో.. థర్డ్ క్లాస్ వాడివి నాకు చెప్తావా? అంటూ మాట్లాడారు.
మంచు మనోజ్‌ను భాకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. భాకరావుపేట పీఎస్ వద్ద మనోజ్ అర్ధరాత్రి హల్ చల్ చేశారు. ఓ స్థానిక ఓ రిసార్ట్‌లో ఆయన బస చేయగా అదే సమయంలో పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడి వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు.
జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేడు గ్రీవెన్స్ లో కిరణ్ రాయల్ పై ఆమె ఫిర్యాదు చేసింది. ఆపై ప్రెస్ క్లబ్ కి వెళ్లగా ఆ సమీపంలో లక్ష్మిని అరెస్టు చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నలుగురు నిందితుల్ని సీబీఐ సిట్ అరెస్టు చేసింది.వీరి నలుగుర్ని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్‌కుమార్ నివాసానికి తీసుకెళ్లారు. రిమాండ్ విధించడంతో.. తిరుపతి సబ్ జైలుకు తరలించారు