/rtv/media/media_files/2025/09/19/pawan-kalyan-2025-09-19-18-12-25.jpg)
కూటమి నేతల్లో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఎంపిక చిచ్చురేపుతుంది. జనసేన నేత కొట్టే సాయి కు చైర్మన్ పదవి ఎంపిక చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కు శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మాజీ ఇంఛార్జ్, జనసేన బహిష్కృత నేత వినుత కోట బహిరంగ లేఖ రాశారు. శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ పదవి కొట్టె సాయికి ఇవ్వడంపై ఆమె తన లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవం లేని, నాపై జరిగిన రాజకీయ కుట్రలో ఉన్న వ్యక్తికి, ఆలయ ఛైర్మన్ పదవి ఇవ్వడంపై పునరాలోచన చేయాలన్నారు. అర్హులు చాలా మంది జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నారని, వారిని గుర్తించా మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని వినుత లేఖలో తెలిపారు.
Also Read : Ponguleti: సుమన్ హీరోగా మంత్రి పొంగులేటి బయోపిక్.. సినిమాలో ఆ సీన్లే హైలైట్?
రాయుడు హత్య కేసులో
తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాసులు అలియాస్ రాయుడు(22)ను కిరాతకంగా చంపించి చెన్నైలోని ఓ నదిలో పడవేసిన కేసులో వినుత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెకు బెయిల్ మంజూరైంది. రాయుడు హత్య కేసులో ఏ3 గా ఉన్న ఆమెకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది, అయితే ప్రతి రోజు ఉదయం 10 గంటలు లోపు C3 సెవెన్ వెల్స్ చెన్నై పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈకేసులో విచారణ పూర్తయ్యేవరకు పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది.
Also Read : BIG BREAKING : ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో చిన్నతనం నుంచే అమ్మమ్మ వద్ద పెరిగాడు. ఆ తర్వాత జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ వినుత వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా.. డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. చిన్నప్పటి నుంచి నమ్మినబంటుగా మెలిగాడు. ఏమైందో ఏమోగానీ ఇటీవల అతనిపై అనుమానం పెంచుకున్నారు. విధుల నుంచి సైతం తొలగించేశారు. తొలగించిన సమయంలో శ్రీనివాసులు తమకు ద్రోహం చేసిన కారణంగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కోట వినూత వెల్లడించారు. ఇకపై అతనికి, తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇక్కడి వరకు భాగానే ఉన్న ఆ తర్వాత అతను హత్యకు గురయ్యాడు. చెన్నై సమీపంలో అతని మృతదేశం లభించడం సంచలనంగా మారింది. చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. పోలీసులు అరా తీయగా అతనిది హత్య అని తేలింది.
Also Read : BIG BREAKING : మైనార్టీలకు రేవంత్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 1.50 లక్షలు