/rtv/media/media_files/2025/09/21/mahalaya-amavasya-2025-2025-09-21-13-21-36.jpg)
Mahalaya Amavasya 2025
నేడు మహాలయ అమావాస్య(Mahalaya Amavasya 2025) సందర్భంగా తిరుపతి(tirupati) లోని కపిలతీర్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాలయ అమావాస్యను "సర్వ పితృ అమావాస్య" అని కూడా అంటారు. ఈరోజున పూర్వీకులకు, చనిపోయిన బంధువులకు ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజలు, తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. పితృ దేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు వదలడానికి భక్తులు పుణ్య క్షేత్రాలకు వెళ్తుంటారు. అయితే తిరుపతిలోని కపిలతీర్థం ఈ కార్యకలాపాలకు ఒక ప్రముఖ కేంద్రం. దీంతో కపిల తీర్థం ఆలయానికి జనం పోటెత్తారు. . పిండ ప్రదానాలు, తర్పణాలు వదిలేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం మొదటి ప్రవేశ ద్వారం వద్ద తోపులాట జరిగింది.
Also Read : బాపట్లజిల్లా మార్టూరు NH 16 పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) September 21, 2025
మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతి కపిలతీర్థం ఆలయానికి పోటెత్తిన భక్తులు
పిండాలు, తర్పణలు వదిలేందుకు ప్రత్యేక పూజలు
ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రవేశ ఆర్చి వద్ద భక్తులకు తీవ్ర ఇబ్బందులు
వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన తర్వాత కూడా మేలుకోలేదని భక్తుల ఆగ్రహం
ప్రత్యేక… pic.twitter.com/qs1BkblSEo
భక్తుల ఆవేదన
ఈ తోపులాటలో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో భక్తులు ఆలయ సిబ్బంది పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పితృ తర్పణలు, పిండ ప్రదానం చేయించుకోవడానికి వచ్చిన భక్తులకు కనీస ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా రద్దీని అదుపు చేయడానికి కనీసం ప్రత్యేక క్యూ లైన్ పద్ధతి పెట్టకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు భక్తులు.
Also Read : పల్నాడు గడ్డపై వైసీపీకి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్