/rtv/media/media_files/2025/04/13/FAtxjxTUHZeeYt0oWZb2.jpg)
Maoist Party
వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీ(Maoist Party) కి తిరిగి జవసత్వాలు నింపేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి కార్యదర్శిని నియమించినట్లు తెలుస్తోంది. కాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ గా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన తర్వాత ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. కాగా ఇటీవల జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో కొత్త సెక్రటరీ నియమాకానికి సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీని నూతన కార్యదర్శిగా నియమించినట్లు తెలుస్తోంది. గ్రీన్ హాంట్ లో భాగంగా ఈ ఏడాది భద్రతా దళాలు అనేకమంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. మూడున్నర నెలల కింత ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నంబాల కేశవరావు తో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న ఆయనపై రూ.1.5 కోట్ల రివార్డు కూడా ఉంది. అయితే ఆ తర్వాత వారి మృతేదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహన సంస్కరణలు నిర్వహించడం అప్పట్లో వివాదస్పదమైందిజ
కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు చెందిన ఆ పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) చీఫ్, పొలిట్‌బ్యూరో సభ్యుడుగా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని కేంద్ర సెక్రటరీగా నియమించినట్లు పార్టీ ప్రకటించినట్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. అయితే, మావోయిస్టు పార్టీ 15 రోజుల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినప్పటికీ మరోసారి తెలుగువారికే కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
Also Read : రూ.4 లక్షలు ఇస్తేనే బిల్డింగ్ పర్మిషన్.. ACBకి అడ్డంగా దొరికిన మహిళా ఆఫీసర్!
తిరుపతి బ్యాగ్రౌండ్ ఇదే...
తిప్పిరి తిరుపతి ప్రస్తుత జగిత్యాల జిల్లా(jagitial) కోరుట్ల అంబేడ్కర్‌నగర్‌కు చెందినవాడు. ఆయన 1983లో డిగ్రీ చదువుతున్న సమయంలో ఉద్యమానికి ఆకర్శితుడై రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరాడు. ఆ సమయంలో కాలేజీలో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో తిరుపతిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దళ సభ్యుడిగా నాటి పీపుల్స్ వార్‌లో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ కమాండర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. మిలీషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్ కేడర్ హోదాలో తిరుపతి పనిచేస్తున్నారు. కాగా, ఆయనను ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో దేవ్‌జీగా పిలుచుకుంటారు. మిలీషియా దాడులు చేయడం, తప్పించుకోవడం తిరుపతికి అనుభవం ఉందని తెలుస్తోంది. 2003లో తిరుపతి లోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడిలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు నాడు ప్రచారం జరిగింది. 2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి 74 మంది జవాన్ల మృతికి కారణమైన ఘటనకు సారథ్యం వహించింది తిరుపతి అని పోలీసు వర్గాలు చెబుతాయి. ఆయన తలపై ఎన్‌ఐఏ రూ. కోటి రివార్డు ప్రకటించింది. తిరుపతి ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీ ఉద్యమ రూపాన్ని మార్చుకుని కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుందని నాయకత్వం ఆలోచిస్తుంది.
ఇది కూడా చూడండి: కవితక్కతోనే నా ప్రయాణం.. బీఆర్ఎస్ కు షాకిచ్చిన కీలక నేత!