AP Crime : భార్యను కాపురానికి పంపలేదని అత్తను ఏసేసిన అల్లుడు

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపట్లేదని అత్తను చంపేశాడో అల్లుడు. నాయుడుపేట మండలం అయ్యపరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update
atta

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపట్లేదని అత్తను చంపేశాడో అల్లుడు. నాయుడుపేట మండలం అయ్యపరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కొన్నేళ్లుగా భార్యను కాపురానికి పంపడం లేదని అత్త చెంగమ్మ(47)పై అల్లుడు వెంకయ్య కక్షగట్టాడు. ఆమెను ఎలాగైనా చంపేయాలని స్కెచ్ వేశాడు.  పథకంలో భాగంగా తాను ఆత్మహత్యకు పాల్పడతానని ఆమెను ఫోన్‌లో బెదిరించాడు.

అయ్యపరెడ్డిపాలేనికి రప్పించి

ఈ క్రమంలో అత్తను అయ్యపరెడ్డిపాలేనికి రప్పించాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు.  అనంతరం మృతదేహాన్ని స్వర్ణముఖి నదీ తీరంలో పూడ్చిపెట్టాడు.  గ్రామస్థులు, బంధువులు నిలదీయడంతో అసలు విషయాన్ని చెప్పాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు వెంకయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. 

Advertisment
తాజా కథనాలు