HYD-Tirupati వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఫ్లైట్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించారు సిబ్బంది. గాల్లోకి ఎగిరిని విమానాన్ని పైలట్లు తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ సమయంలో 67 మంది ప్రయాణీకులు ఉన్నారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకుల్ని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ఫ్లైట్‌లో టెక్నికల్ సమస్యలు తరుచూ వార్తల్లో నిలుస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే అలయన్స్ ఫ్లైట్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. విమాన సిబ్బంది విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించారు. గాల్లోకి ఎగిరిని విమానాన్ని పైలట్లు తిరిగి మళ్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ సమయంలో 67 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఘోర ప్రమాదం తప్పడంతో ప్యాసింజర్లు ఊపిరిపీల్చుకున్నారు. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి ఘోర ప్రమాదం నుంచి విమానాన్ని కాపాడారు. ప్యాసింజర్లను సురక్షితంగా ఎయర్‌పోర్ట్‌లో దింపారు. వారంతా ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే పడిగాపులు కాస్తున్నారు.

సాంకేతిక లోపం తలెత్తడం గురించి సమాచారం అందుకున్న అధికారులు విమానయాన భద్రతను నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. విమానయాన సంస్థ ఈ సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సంస్థ తెలిపింది. ఈ ఘటనకు గల కారణాలను విమానయాన భద్రత అధికారులు, నిపుణులు పరిశీలిస్తున్నారు. పూర్తి నివేదిక వచ్చాక విమానంలో లోపం ఎలా తలెత్తిందో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ సంఘటనతో ప్రయాణికులందరూ భయపడినా, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ల సమయస్ఫూర్తితోనే ఘోర ప్రమాదం తప్పిందని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన భద్రతపరంగా విమానయాన సంస్థలు ఎంత అప్రమత్తంగా ఉండాలో మరోసారి గుర్తు చేసింది.

Advertisment
తాజా కథనాలు