Tirupati: తిరుపతిలో మరో మహా అద్భుతం! సాయిబాబా విగ్రహం నుంచి రాలుతున్న విభూతి! (వీడియో)
తిరుపతిలో మరో మహా అద్భుతం జరిగింది. ఓ ఇంట్లో పూజామందిరంలో పూజిస్తున్న సాయిబాబా విగ్రహం నుంచి విభూది రాలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తిరుపతిలో మరో మహా అద్భుతం జరిగింది. ఓ ఇంట్లో పూజామందిరంలో పూజిస్తున్న సాయిబాబా విగ్రహం నుంచి విభూది రాలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎప్పటి నుంచో వివాదస్పదంగా ఉన్న తిరుమల శ్రీవారికి పింక్ డైమండ్ అనే సమస్య ఓ కొలిక్కి వచ్చింది. మైసూర్ రాజు ఇచ్చిన ఆ హారం కేవలం కెంపు రాయి మాత్రమే పింక్ డైమండ్ కాదని తాజాగా పురావస్తు శాఖ (ASI) డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు.
తన కోరిక తీర్చమని ఓ గ్రామ రెవెన్యూ అధికారిణి (వీఆర్ఓ)ను వేధించాడో ఎమ్మార్వో. అక్కడితో ఆగకుండా ఆమె ఇంటికే వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి వీఆర్ఓ తల్లి ఎమ్మార్వోపై చెప్పు చీపురుతో దాడి చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రేణిగుంట, హైదరాబాద్ ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పైలట్లు విమానాన్ని 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించి, చివరికి తిరుపతిలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినూత మాజీ డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన ఆరోపణలు చేసింది. డ్రైవర్ రాయుడు చెల్లి డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించమని డీఎస్పీని కోరింది. తమకి రూ.30 లక్షలు ఆఫర్ చేశారని తెలిపింది.
తిరుపతిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు బోగీల్లో మంటలు చేలరేగాయి. లూప్లైన్లలో ఉన్న రాయలసీమ, షిరిడీ ఎక్స్ప్రెస్లో రెండు భోగీల్లో మంటలు చెలరేగి.. పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. భారీగా పొగ, మంటలు వ్యాపించడంతో భక్తులు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది.
తిరుపతి జిల్లా తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారులో ఇద్దరి యువకుల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి టీటీడీ మరోసారి నోటీసులు పంపింది. తాజాగా వీరు తిరుపతి వెళ్లగా దర్శనం తర్వాత వారు బస చేసిన అతిథిగృహం వద్ద మాధురి లంగావోణీలో రీల్స్ చేశారు. ఈ క్రమంలో టీటీడీ మరోసారి నోటీసులు పంపింది.