TTD Laddu Issue: టీటీడీ నెయ్యి కల్తీ కేసు.. రూ.250 కోట్ల కుంభకోణం.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో సీబీఐ తన సిట్ విచారణను పూర్తి చేసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి నెల్లూరులోని ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది

New Update
Tirumala Laddu -1

Tirumala laddu

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో సీబీఐ తన సిట్ విచారణను పూర్తి చేసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి నెల్లూరులోని ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు. ఉత్తరాఖండ్‌కు చెందిన 'భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ' అనే సంస్థ 2021 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమలకు సుమారు 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసింది. దీని విలువ సుమారు రూ.250 కోట్ల రూపాయలుగా తేలింది. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ డెయిరీ అసలు ఒక్క లీటరు పాలు కూడా సేకరించకుండానే నెయ్యిని తయారు చేసినట్లు సీబీఐ గుర్తించింది.

ఇది కూడా చూడండి: Ajith Pawar Plane Crash: అజిత్ పవార్ ప్రయాణించిన విమానం 'లీర్జెట్ 45' వివరాలు.. గతంలో కూడా ఇదే విమానానికి ఘోర ప్రమాదం!

నెయ్యిని ఎలా కల్తీ చేశారంటే?

శుద్ధమైన ఆవు నెయ్యికి బదులుగా పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటి చౌకబారు నూనెలను కలిపినట్లు విచారణలో వెల్లడైంది. ల్యాబ్ పరీక్షల్లో ఈ కల్తీ దొరక్కుండా ఉండేందుకు బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను, నెయ్యి వాసన వచ్చే ఫ్లేవర్లను వాడినట్లు సిట్ నిర్ధారించింది. తిరుమల నాణ్యత పరీక్షలను మోసం చేసేలా ఈ రసాయనాల మిశ్రమాన్ని తయారు చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

టీటీడీ సిబ్బంది పాత్ర

ఈ భారీ కుంభకోణంలో బయటి వ్యక్తులతో పాటు టీటీడీలోని కొందరు కీలక అధికారులు కూడా కుమ్మక్కయ్యారు. టీటీడీ మాజీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ సబ్రమణ్యం సహా ఏడుగురు సిబ్బంది నిందితుల జాబితాలో ఉన్నారు. నిబంధనలను అతిక్రమించి, బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థలకు కూడా ఆర్డర్లు ఇచ్చేలా వీరు సహకరించినట్లు తేలింది. ఢిల్లీకి చెందిన రసాయనాల సరఫరాదారు అజయ్ కుమార్ సుగంధ్ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో ఇప్పటివరకు 36 మందిని నిందితులుగా గుర్తించగా, 9 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు ప్రస్తుతం బెయిల్‌పై ఉండగా మాజీ అధికారి సబ్రమణ్యం సహా ముగ్గురు నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: కుప్పకూలిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం.. కారణమిదే?

Advertisment
తాజా కథనాలు