/rtv/media/media_files/2025/09/16/tirumala-2025-09-16-10-44-26.jpg)
ప్రతీ ఏటా నాలుగు సార్లు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే నేడు నిర్వహించారు.
/rtv/media/media_files/2025/09/16/tirumala-2025-09-16-10-44-37.jpg)
సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ సింఘాల్, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/09/16/tirumala-2025-09-16-10-44-46.jpg)
ఆలయంలో ఎలాంటి దుమ్ము, ధూళి పడకుండా స్వామి వారి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. ఆ తర్వాత శ్రీచూర్ణం, ముద్దకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధాలతో గంగాజలాన్ని సిద్ధం చేసి వాటితో శుద్ధి చేస్తారు.
/rtv/media/media_files/2025/09/16/tirumala-2025-09-16-10-44-55.jpg)
ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేవలం అర్చకులు మాత్రమే చేస్తారు. సాధారణ భక్తులకు ప్రవేశం కల్పించరు.
/rtv/media/media_files/2025/09/16/tirumala-2025-09-16-10-45-08.jpg)
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే చేస్తారు. అయితే ఈ పర్వదినాల ముందుగా వచ్చే మంగళవారం మాత్రమే ఆలయాన్ని శుద్ధి చేస్తారని అర్చకులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/09/16/tirumala-2025-09-16-10-45-18.jpg)
ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో టీటీడీ నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఆలయ శుద్ధి తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు.