/rtv/media/media_files/2025/09/19/police-treatment-of-pokies-2025-09-19-11-42-48.jpg)
Police treatment
Crime News: తిరుపతిలో ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. రోడ్డుపై మహిళలు కనిపిస్తే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నిన్నరాత్రి కొందరు పోకిరీలు మద్యం మత్తులో రెచ్చిపోయారు.లీలామహల్ జంక్షన్‌లో అల్లరి మూకల వెకిలి చేష్టలకు దిగారు. నిన్న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. లీలామహల్ జంక్షన్ సమీపంలోని అమెరికన్ భార్ వద్ద ఆరుగురు యువకులు రోడ్డుపై వెళ్తున్న తల్లీ కూతుళ్లను వేధించారు. మద్యం మత్తులో ఆకతాయిలు తల్లీకూతుళ్లను పరిగెత్తించారు. రోడ్డుపై వెళ్తున్న తల్లి కూతురును యూటీజింగ్ చేసి అసభ్యకరంగా వ్యవహరించిన పోకిరీలు.మత్తులో వీరవిహారం చేయడంతో భయంతో తల్లితో కలిసి యువతి పరుగులు పెట్టింది.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిలో ముగ్గురిని పట్టుకుని రోడ్డుపైనే చావబాదారు. మరో ముగ్గురు పారీపోయారు. అంతకు ముందు బార్‌లో గొడవ పడ్డ ఆకతాయిలు రోడ్డు మీదకు వచ్చి హల్చల్ చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారికి లాఠీలతో గుణపాఠం చెప్పారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్ కు తరలించారు. సకాలంలో స్పందించి సరైన శిక్ష వేశారంటూ పోలీసులకు అభినందనలు తెలిపారు.
ఇది కూడా చూడండి:Skin Health: అరేబియన్ భామల అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా?