Snake Bite : మందెంత పనిచేసే నారాయణ...కాటేసిన పాము తలకొరికి..పక్కనే పెట్టుకుని నిద్ర... ఆ తర్వాత ఏం జరిగిందంటే?

మద్యం తాగిన మత్తులో తనను కాటువేసిన పామును ఏకంగా  తలకొరికి చంపేశాడు. అనంతరం చనిపోయిన పామును తన వెంట తీసుకెళ్లి పక్కనే పెట్టుకుని పడుకున్నాడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరంలో చోటు చేసుకుంది.

New Update
A snake bit a man..

A snake bit a man..

 Snake Bite : మందు మనిషితో ఎంతటి పనినైన చేయిస్తుంది. విచక్షణ కోల్పోయినమంటే అనేక విన్యాసాలు చేయిస్తుంది. కొన్ని సార్లు మద్యం మత్తులో చేయరాని పనిచేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.  చూసేవారికి కొన్నిసార్లు ఇవి గమ్మత్తుగా ఉన్నా, మరి కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది.  తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. సాధారణంగా ఎవరైనా పామును చూస్తేనే భయంతో పరుగులు తీస్తారు. ఒకవేళ అనుకోకుండా పాటు కాటువేస్తే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం మద్యం తాగిన మత్తులో తనను కాటువేసిన పామును ఏకంగా  తలకొరికి చంపేశాడు. అనంతరం చనిపోయిన పామును తన వెంట తీసుకెళ్లి పక్కనే పెట్టుకుని పడుకున్నాడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరంలో చోటు చేసుకుంది.

 స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించాడు. తాగిన మత్తులో ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మత్తుగా విషపూరితమైన కట్ల పాము కాటు వేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్, ఆ పామును వెంబడించి పట్టుకున్నాడు. కోపంతో దాని తలను నోటితో కొరికి చంపేశాడు. అనంతరం ఆ పామును తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. చనిపోయిన పామును అలాగే భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన పామును వెంకటేశ్ రాత్రి తన పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు. అయితే అర్ధరాత్రి సమయంలో వెంకటేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడం మొదలు పెట్టింది.  పాము(snake) విషం శరీరంలోకి ఎక్కడంతో వెంకటేశ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.  వెంటనే గమనించిన కుటుంబసభ్యులు వెంకటేశ్​ను హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్లు అతడికి చికిత్స అందించారు. అనంతరం వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అధునాతన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

కాగా వెంకటేశ్ చర్యలపై స్థానికులు రకరకాలుగ కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉంది. విషపూరిత పాముకాటుకు తక్షణ చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు.

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

Advertisment
తాజా కథనాలు