Heroine Ravali: పెళ్లి సందడి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

స్టార్ హీరోయిన్ రవళి తాజాగా తిరుమలలో కనిపించారు. పెళ్లి సందడి సినిమాతో హిట్ కొట్టిన ఈమె పెళ్లి తర్వాత మూవీలకు దూరంగా ఉంటోంది. అయితే ఇప్పుడు తిరుమలలో రవళిని చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు.

New Update

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక ఊపు ఊపేసిన బ్యూటీ రవళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఆమె సంపాదించుకుంది. తెలుగులో దాదాపుగా ఆమె అందరి స్టార్ హీరోలతో  నటించింది. అప్పుడు తన అందం, అభినయంతో ప్రేక్షకులను సొంతం చేసుకన్న హీరోయిన్ రవళిని చూసి ఇప్పుడు చూసి షాక్ అవుతున్నారు. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొంత కాలం నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే రవళి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రావడంతో కనిపించారు. అప్పుడు నాజుకుగా ఉన్న ఈమె ఇప్పుడు బరువు పెరిగారు. దీంతో ఫ్యాన్స్ ఆమెను ఒక్కసారిగా గుర్తు పట్టలేకపోయారు. చాలా ఏళ్ల తర్వాత ఆమెను తిరుపతిలో చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. 

Ravali
Ravali

ఇది కూడా చూడండి: Rashmika Mandanna: ట్రెడిషనల్ లుక్‌లో నేషనల్ క్రష్ స్టిల్స్.. ఎంత అందంగా ఉందో ఫొటోలు చూశారా?

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని..

మలయాళ సినిమా 'జడ్జిమెంట్' తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవళి తెలుగులో 'జయభేరి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే  కెరీర్ ప్రారంభంలో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ 1996లో విడుదలైన 'పెళ్లి సందడి' సినిమా హిట్ కావడంతో ఒక్కసారిగా ఆమె లైఫ్ టర్న్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్‌ హీరోయిన్‌గా రవళి మారిపోయింది. దీంతో వరుసగా తెలుగులో కూడా ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమా హిట్ తర్వాత రవళి'శుభాకాంక్షలు', 'ముద్దుల మొగుడు', 'చిన్నబ్బాయి', 'వినోదం' వంటి అనేక సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. ఇలా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో రవళి 2007లో నీలికృష్ణ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. రవళికు ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చివరగా 2011లో సినిమాలో కనిపించగా మళ్లీ తాజాగా తిరుమలలో కనిపించింది. దీంతో ఫ్యాన్స్ ఆమెను చూసి ఎంతో సంతోషపడుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: Beauty Movie: ''OG''కి ఎదురెళ్తున్న.. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న: హీరో అంకిత్ కొయ్య

Advertisment
తాజా కథనాలు