TG Government: జీపీవోలుగా మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలు
గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్వోలు, వీఆర్ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.డిగ్రీ అర్హత ఉన్నటువంటి మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలకు జీపీవోగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్వోలు, వీఆర్ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.డిగ్రీ అర్హత ఉన్నటువంటి మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలకు జీపీవోగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని టప్పాచబుత్రలో నకిలీ మెహందీ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మెహందీలో ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితునిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ చోరీలతో రెచ్చిపోతున్నారు. హన్మకొండలో తాళం వేసిన ఇంట్లో రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ టీవీలో దొంగతనం దృశ్యాలు రికార్డైంది. నెల రోజుల్లో 9 చోట్ల దొంగతనాలు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సెక్రెటేరియట్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం రేపుతోంది. CMOతో సహా మంత్రుల పేషిలు, అధికారులకు నాసిరకం భోజనం సప్లై చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతిరోజూ ఫుడ్ తనిఖీ చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
మీర్పేట్లోని హస్తీనాపురంలోనది దావత్ హోటల్లో బిర్యానీ బాగోలేదని చెప్పిన కస్టమర్‌పై విచక్షణారహితంగా కొట్టారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హోటల్ సీజ్ చేసి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలోని ఆలయాల్లో కల్తీ నెయ్యి వ్యవహారం దుమారమే రేపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆలయాలకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. దీంతో దేవాదాయశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరులో ఓగులపు అజయ్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. మహాలక్ష్మి పుట్టిందని ఊరిలోఉన్న ప్రతి మహిళకు చీరలను ఇంటింటికీ తిరుగుతూ తండ్రి పంపిణీ చేశారు. అజయ్ అలా పంచడానికీ రూ.30 కోట్ల లాటరీ తగటం కూడా ఓ కారణం ఉందట.
వరంగల్ జిల్లా రాయపర్తిలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రూ.10 కోట్ల విలువైన15 కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. గ్యాస్ కట్టర్ సాయంతో అలారం సిస్టమ్, సీసీ టీవీ ఫుటేజీని ధ్వసం చేశారు.
ఖమ్మంలో ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 960 కేజీల క్వాలిటీ లేని అల్లం, వెల్లుల్లి పేస్ట్ పాకెట్లను సీజ్ చేశారు. నిబంధనలు, అనుమతులు లేని వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.