TG News: ఒకేరోజు పురుగుల మందు తాగి ఇద్దరు స్నేహితులు మృతి!

వరకట్న వేధింపులు తట్టుకోలేక ఒకే దగ్గర పనిచేస్తూ ఇద్దరు స్నేహితులు అనూష, మమత.. ఒకే రోజు వేర్వేరు చోట్ల పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌,  పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రగతి నగర్‌లో చోటుచేసుకున్నాయి.

New Update
dowry harassment two married women committed suicide

dowry harassment two married women committed suicide

TG News: ఈ మధ్య వరకట్నం కోసం, వివాహేతర సంబంధాల కోసం కట్టుకున్న భార్యలను, భర్తలను హతమారుస్తున్న ఘటనలు ఎక్కువతున్నాయి. తాజాగా మరో ఇద్దరు భార్యలు వరకట్న వేధింపులకు మరో ఇద్దరు భార్యలు బలయ్యారు. వరకట్న వేధింపులు తట్టుకోలేక ఒకే దగ్గర పనిచేస్తూ ఇద్దరు స్నేహితులు  అనూష, మమత ఒకే రోజు  పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఈనెల 23న ఇద్దరు వేర్వేరు చోట్ల పురుగుల మందు తాగగా.. చికిత్స పొందుతూ బుధవారం రోజు ఇద్దరూ మృతి చెందారు. వీరి మృతి కుటుంబ సభ్యులను,  తోటి ఉద్యోగులను కలిచి వేసింది. ఈ విషాదకర ఘటనలు కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌,  పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రగతి నగర్‌లో చోటుచేసుకున్నాయి.

మమత కథ 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌ మండలంఇందిరా నగర్ కి చెందిన  రొడ్డ మమతకు 2018లో కర్ర రాజమల్లుతో వివాహం జరిగింది. అయితే పెళ్లి చేసేటప్పుడు రూ.2 లక్షల కట్నం ఇస్తామని ఒప్పుకొన్న ఒప్పుకున్న మమతా తల్లి.. పెళ్ళైన ఏడాదిలోగా రూ.1,70,000 మమత అత్తింటికి ముట్టజెప్పింది. మిగతా 30 వేలకు బదులుగా కొంత బంగారం అప్పజెప్పింది. ఈ బంగారాన్ని మమత భర్త అమ్ముకొని వాడుకోవడమే కాకుండా మరో రెండు లక్షలు తేవాలని మమతను వేధింపులకు చేయడం మొదలు పెట్టాడు. ఇది చాలదు అన్నట్లు వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇవన్నీ తట్టుకోలేకపోయిన మమత ఈనెల 23న పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. మమత తల్లి ఫిర్యాదు మేరకు భర్త రాజమల్లుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అనూష కథ

మరోవైపు ఎన్టీపీసీ ప్రగతి నగర్‌కు చెందిన అనూష కథ విషయానికి వస్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనూషకు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని వింజంపల్లికి చెందిన రమేష్‌తో ఎనిమిది సంవత్సరాల కిందట పెళ్లయింది. ఇతడు కూడా 2 లక్షల అదనపు కట్నం కోసం అనూషను, ఆమె తల్లిదండ్రులను వేధింపులకు గురిచేశాడు. అంతేకాదు రమేష్ కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమ్మలో పదిహేను రోజుల క్రితం భార్యను ఇంటి నుంచి పుట్టింటికి పంపించేశాడు. అప్పటి నుంచి అనూష తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ బాధలన్నింటితో జీవితంపై విరక్తి  చెందిన అనూష కూడా పురుగుల మందు తాగి చనిపోయింది. ఈమెకు ఐదేళ్ల కూతురు ఉంది. అనూష, మమత ఇద్దరూ తిమ్మాపురం ఇందిరానగర్ లోని ఓ డైరీలో పనిచేస్తున్నారు. అనూష తండ్రి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామల పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: Priya Prakash Varrier: గోల్డెన్ కలర్ బ్లౌజ్‌లో ప్రియా ప్రకాశ్ ఎద అందాలు.. కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తుందిగా!

Advertisment
Advertisment
తాజా కథనాలు