/rtv/media/media_files/2024/11/25/KbxBAkfsRVelR3IHn1GL.jpg)
Osmania University
Osmania University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం కొనసాగుతుండగానే మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఓయూ ప్రొఫెసర్ క్వార్టర్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. యూనివర్సిటీలో ప్రొఫెసర్లకు కేటాయించాల్సిన క్వార్టర్లను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు కేటాయించి పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయమై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ
కాగా ప్రైవేట్ వ్యక్తులకు క్వార్టర్స్ ఇవ్వడంపై ఓయూ వీసీ (వైస్ చాన్సలర్)ని విచారించగా క్వార్టర్లు ప్రవేటు వ్యక్తులకు ఇచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, గతంలో ఇన్‌ఛార్జి వీసీగా ఉన్న వ్యక్తి ఈ క్వార్టర్స్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ప్రస్తుతం ఉన్న వీసీ వెల్లడించారు. మినిట్స్ బుక్‌లో ఈ విషయాన్ని తనూ చూసినట్లు పేర్కొన్నారు. అంతేతప్ప తనకు ఈ విషయంతో సంబంధం లేదని వెల్లడించారు. ఈ విషయాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అలా ప్రైవేటే వ్యక్తులకు కేటాయించడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓయూ ప్రొఫెసర్లు ఈ క్వార్టర్స్ లో నివాసముంటే వారి వేతనం నుంచి నెలకు ₹40,000 కట్ చేస్తారని కానీ, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు మాత్రం కేవలం ₹1,000కే ఇవ్వడాన్ని వారు తప్పు పడుతున్నారు. కాగా ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి ఈ ఇష్యూకు కారణమైన వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!
అయితే ఓయూలో ఉన్న క్వార్టర్లు ప్రొఫెసర్లకు కేటాయిస్తే వారినుంచి రూ.40000 వసూలు చేస్తున్నారని, అంతమొత్తం చెల్లించడానికి వారు ఆసక్తి చూపకపోవడం వల్ల అవి ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భయట అందులో సగం చెల్లిస్తే అన్ని వసతులతో కూడిన ఇల్లు దొరుకుతుండటంతో వారు ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదట. దీంతో వాటిని బయటి వ్యక్తులకు కేటాయిస్తున్నారని చెబుతున్నారుప్రొపెసర్లకు సైతం తక్కువ అద్దెకు కేటాయిస్తే వారు ఉండడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో అధికారులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?