/rtv/media/media_files/2025/04/25/FrYv9ZsrDOvrSLqTMjka.jpg)
heat waves tg
రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇటీవల అకాల వర్షాలతో కొంచెం చల్లబడినప్పటికీ .. తరువాత నుంచి ప్రతాపం మామూలుగా చూపించడం లేదు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిప్పుల కుంపటిని తలపిస్తుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిన నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
29 జిల్లాల్లో 42 డిగ్రీలు దాటగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు పలు జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు సాధారణం కన్నా మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అలాగే రానున్న రెండ్రోజుల పాటు పగడి పూట వడగాల్పులు, రాత్రికి వేడి వాతావరణ ఉంటుందని పేర్కొంది. మరోవైపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు సాధారణం కన్నా మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే రానున్న రెండ్రోజుల పాటు పగడి పూట వడగాల్పులు, రాత్రికి వేడి వాతావరణ ఉంటుందని పేర్కొంది. మరోవైపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు ఏడుగురు మృతి చెందారు.
Also Read:BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
Also Read: Pak: ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులు..పాక్ ఉప ప్రధాని ప్రేలాపన
tg-news | heat-waves | sun-stroke | latest-news | latest-telugu-news | latest telugu news updates