TG Government: జీపీవోలుగా మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు

గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.డిగ్రీ అర్హత ఉన్నటువంటి మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏలకు జీపీవోగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.

New Update
Telangana

Telangana

గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి విధివిధానాలు, అర్హతలు ఖరారు చేస్తూ రెవెన్యూశాఖ జీవో ఇచ్చింది. డిగ్రీ అర్హత ఉన్నటువంటి మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏలకు జీపీవో(గ్రామపాలన అధికారులు)గా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.

Also Read: Telangana Rain Alert: మండుతున్న ఎండల్లో చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..రానున్న మూడు రోజుల పాటు వానలే వానలు!

ఇంటర్‌ తో  పాటు 5 ఏళ్లు వీఆర్‌వో లేదా వీఆర్‌ఏగా అనుభవం ఉన్నవారు దీనికి అర్హులని అధికారులు ప్రకటించారు. స్క్రీనింగ్ టెస్ట్​ ద్వారా ఎంపిక జరుగుతుంది.గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏల నియామకానికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జీపీవోలుగా మాజీ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏల నియామకంపై విధివిధానాలు, అర్హతలను ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Nubia Neo 3 5G: ఏంటి భయ్యా ఈ అరాచకం.. 12/256జీబీ కొత్త ఫోన్ ఇంత చీపా- వదలొద్దు మావా!

రాష్ట్రంలో 10,954 మంది గ్రామపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.రద్దయిన వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలకు జీపీవోలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అయితే గ్రామ పాలన అధికారులకు రెవెన్యూ వ్యవస్థపై అవగాహన ఉండాలని రిపోర్టులు రాయగలిగి ఉండాలని సీసీఎల్‌ఏ ప్రభుత్వానికి సూచించారు. భూపరిపాలన ప్రధాన కమిషనర్ సూచనలను పరిశీలించిన ప్రభుత్వం అర్హతలను ప్రకటించింది. 

డిగ్రీ చదివిన మాజీ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలకు అవకాశం ఇవ్వనున్నట్లు జీవోలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. లేదా ఇంటర్ చదివి కనీసం ఐదేళ్లు వీఆర్ఓ లేదా వీఆర్ఏగా అనుభవం ఉన్న వారు కూడా అర్హులేనని తెలిపారు.

Also Read: Live News Updates: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Also Read: Health Tips: బరువు తగ్గాలని అప్పుడే చేసిన రోటీలు తింటున్నారా?.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

tg-news | telugu-news | vro | vra | cm revanth reddy telangana vra's | cm revanth reddy about vro & vra | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు