/rtv/media/media_files/2025/07/05/ai-helped-pregnant-2025-07-05-19-00-07.jpg)
Ai Helped Pregnant
Ai Pregnant: వైద్య రంగంలో కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఓ అద్భుతాన్ని సాధించింది. సంతానం కోసం 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ దంపతులకు ఏఐ సాయంతో తల్లి తండ్రులయ్యే అవకాశాన్ని అందించింది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ఫర్టిలిటీ సెంటర్‌లో ఈ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. భర్తకు అజూస్పర్మియా అనే సమస్య ఉండటం వల్ల వీర్యంలో కణాలు గుర్తించలేకపోయారు. ఎన్నో సంవత్సరాలు విఫలమైన ఐవీఎఫ్ ప్రయత్నాల తర్వాత చివరిగా ఈ కేంద్రాన్ని ఆశ్రయించారు.
Also Read : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!
వీర్యకణాలు లేవన్న నిరాశలో..
ఇక్కడ STAR (Sperm Tracking and Recovery) అనే నూతన టెక్నాలజీని వైద్య బృందం ప్రయోగించింది. దీని ద్వారా మహిళ భర్త వీర్య నమూనాలో దాగి ఉన్న జీవకణాన్ని గుర్తించగలిగారు. ఇది సాధారణ పరీక్షల్లో పట్టుబడనిది. ఎస్ఎస్టీఏఆర్ పద్ధతిలో కేవలం ఒక గంటలోనే 44 స్పెర్మ్ కణాలు గుర్తించబడ్డాయి. వాటిలో ఒకదానిని ఉపయోగించి భార్య అండాన్ని ఫలదీకరించి, ఐవీఎఫ్ విధానంలో ఆమె గర్భాన్ని ఏర్పరిచారు. ఈ విధానంలో గర్భం దాల్చిన మొదటి మహిళగా ఆమె వైద్య చరిత్రలో పేరు వచ్చింది.
ఇది కూడా చదవండి: డాక్టర్ చెప్పిన ఈ చిట్కాలతో చిన్నపాటి వ్యాధులను ఎదుర్కోవచ్చు
ఈ విజయవంతమైన పద్ధతిని అభివృద్ధి చేయడానికి సీయూఎఫ్‌సీ డైరెక్టర్ డాక్టర్ జెవ్ విలియమ్స్ నేతృత్వంలోని బృందం ఐదేళ్లుగా కృషి చేసింది. ఇది వైద్య రంగంలో ఓ మైలురాయి. వీర్యకణాలు లేవన్న నిరాశలో ఉన్న దంపతులకు ఇది ఒక కొత్త ఆశ. సాధ్యపడదని భావించిన దాన్ని సాధ్యం చేశాయి కృత్రిమ మేధ సామర్థ్యాలు. వైద్య పరిజ్ఞానానికి ఏఐ శక్తి తోడవ్వడం వల్ల ఇకపై మరిన్ని కుటుంబాల కలలూ సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: డ్వాక్రా మహిళలకు ఉప ముఖ్యమంత్రి శుభవార్త.. ఈ నెల 10 నుంచి చెక్కుల పంపిణీ
Also Read : వంట చేసేటప్పుడు చేసే ఈ పొరపాటు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి తెలుసా!?
( TG News | Latest News)