TG News: డ్వాక్రా మహిళలకు ఉప ముఖ్యమంత్రి శుభవార్త.. ఈ నెల 10 నుంచి చెక్కుల పంపిణీ

ప్రజాభవన్‌లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు టీఎస్‌ఆర్టీసీ నుంచి అద్దె చెక్కులు అందజేశారు. సీఎం నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని భట్టి తెలిపారు.

New Update
TG News

TG News

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతానికి విశేష ప్రాధాన్యతనిస్తూ, మహిళా సాధికారతకు దృఢంగా కట్టుబడి పనిచేస్తోంది. మహిళలను మహారాణులుగా గౌరవిస్తూ.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అనేక ప్రోత్సాహక చర్యలు చేపట్టింది. శనివారం ప్రజాభవన్‌లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని.. మహిళా స్వయం సహాయక బృందాలకు టీఎస్‌ఆర్టీసీ నుంచి అద్దె చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తోందని తెలిపారు.

Also Read : ఇట్స్ అఫీషియల్.. అనుష్క ఘాటీ మళ్ళీ వాయిదా!

Also Read : వంట చేసేటప్పుడు చేసే ఈ పొరపాటు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి తెలుసా!?

వడ్డీ లేని రుణాలు..

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వడ్డీ లేని రుణాలపై నిర్లక్ష్యం వహించబడిందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరించి, మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపర్చే విధంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. ఇక మళ్లీ వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 10 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ వడ్డీ లేని రుణాలను ఎంతగానో ఉపయోగించుకోవాలని.. వాటితో వ్యాపారాలు ప్రారంభించి, స్వయం స్వరాజ్యంతో ఎదగాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో మహిళా బృందాలు చర్చలు జరపాలని సూచించారు. మహిళా బృందాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి టీఎస్‌ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది శుభ సూచకమని తద్వారా తొలి దశలో కోటి రూపాయల అద్దెను అందించినట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి: నీరు తాగుతున్నా కూడా డీహైడ్రేషన్ ఆ.. ఈ లోపం కారణమేమో చూడండి

ఇక విద్యుత్ శాఖతో కలిసి మహిళా బృందాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని వెల్లడించారు. దీనివల్ల 1,000 మెగావాట్లకు తగ్గకుండా విద్యుత్ ఉత్పత్తి జరగనుందని తెలిపారు. అలాగే క్యాంటీన్లు, స్కూల్ డ్రెస్సుల తయారీ, పాఠశాలల మరమ్మతులు వంటి పనులను మహిళలకే అప్పగించడం ద్వారా వారికి స్థిరమైన ఆదాయ మార్గాలు అందిస్తున్నట్టు తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని భట్టి విక్రమార్క మరోసారి స్పష్టంచేశారు. మొదటి ఏడాదిలోనే రూ.21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరయ్యాయని.. ప్రతి సంవత్సరం కనీసం రూ.20,000 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కేవలం రుణాలు మాత్రమే కాకుండా.. బ్యాంక్ లింకేజ్, లోన్ బీమా, ప్రమాద బీమా వంటి అవకాశాలు కూడా మహిళా బృందాలకు కల్పిస్తున్నట్టు వివరించారు. ఈ చర్యలన్నీ తెలంగాణలో మహిళా సాధికారతకు కొత్త శకానికి నాంది పలకనున్నాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: వంట చేసేటప్పుడు చేసే ఈ పొరపాటు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి తెలుసా!?

(Latest News | TG News)

Advertisment
Advertisment
తాజా కథనాలు